ఆగని బ్రూణ హత్యల పరంపర..

ఆగని బ్రూణ హత్యల పరంపర..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

–ఏటికేటా తగ్గుతున్న స్త్రీల లింగ నిష్పత్తి

పుట్టగొడుగుల్లా స్కానింగ్ సెంటర్లు

ఒకరి పేరున స్కానింగ్ మిషన్, ఎలిజిబులిటీ లేని మరొక డాక్టర్ చే నిర్వహణ

బ్రూణ హత్యలను నివారించడంలో వైపల్యం చెందుతున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

నామమాత్రపు కమిటీలు

తొలి సమయం ప్రధాన ప్రతినిధి మహబూబాబాద్ డిసెంబర్ 20 :

ఆడపిల్ల అంటేనే సమాజంలో అదోరకమైన భావన కొనసాగుతూనే ఉంది. స్వచ్చంద సంస్థలు ధార్మిక సంస్థలు ట్రస్టులు, ఎంజివో సంఘాలు, మరెన్నో నైతిక సంస్థలు లెక్కలేనన్ని ఉన్నాయి, వాటన్నీటిని నిమిత్త మాత్రం చేస్తూ..కాసుల కక్కుర్తి తో ప్రైవేట్ హాస్పిటల్ లో యజమాన్యాలు విలువలకు తిలోదకాలు ఇస్తూనే పాపాలకు వడి కడుతోనే. బ్రూణ హత్యల పరంపరను కొనసాగిస్తున్నారు. ఏడు సంవత్సరాల నుండి స్త్రీల లింగ నిష్పత్తి క్రమంగా తగ్గుతోంది.రాను రాను వేగం పుంజుకుంటోంది,నిత్యం ఎక్కడో ఓచోట గుట్టు చప్పుడు కాకుండా భ్రూణ హత్యలు జరిగిపోతున్నాయి. ఆడపిల్లల నిష్పత్తిని నియంత్రించడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులది ఆర్బాటమే తప్ప అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి వంద మంది పురుషులకు 736మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు,అని అధికారుల లెక్కలు తేలుస్తున్నాయి . 1994లో బ్రూణ హత్యల నివారణ చట్టం ఏర్పడింది, పాల్పడినా, సహకరించినా వారికి చట్టరీత్యా శిక్షారులు అనే పకడ్బందీ చట్టం ఏర్పడినప్పటికీ..అధికార యంత్రాంగం అలసత్యంతో చట్టాలు అమలుకు నోచుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు, అక్రమ స్కానింగ్ సెంటర్ లపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తే తప్ప బ్రూణహత్యలకు అడ్డుకట్ట వేయలేము అనే విమర్శలు సర్వత్రా నెలకొన్నాయి..
గతం రెండు రోజుల నుండి జిల్లా కేంద్రం లోని స్కానింగ్ సెంటర్లలో కేంద్ర మరియు రాష్ట్ర బృణ హత్య నిరోధక బృందాలు యాద్రుచ్చిక్షంగా ఆకస్మిక తనికీలు నిర్వహించే వరకు జిల్లా ఆరోగ్య అధికార యంత్రాంగానికి స్కానింగ్ కేంద్రాలపై నిఘాతో కూడిన స్పష్టత లేక పోవడంతో జిల్లా ఆరోగ్య అధికారుల పై పలు అనుమానాలకు తావిస్తోంది..

గత పది సంవత్సరాల నుండి స్కానింగ్ సెంటర్ అక్రమ హవా…

జిల్లా కేంద్రంలో సుమారు 15 స్కానింగ్ సెంటర్ లు నడుస్తున్నాయి. స్కానింగ్ మిషన్ ఓ డాక్టర్ పేరున ఉంటుంది కాని ఇంకో ఎలిజిబులిటీ లేని డాక్టర్ అమ్మ లేదా డాక్టర్, స్కానింగ్ చేస్తున్నారు. రిపోర్ట్ పై భయం లేకుండా సంతకాలు చేస్తూ.. అమాయక జనాన్ని బురిడీ కొట్టిస్తూ.. డబ్బులు పోగేసు కుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వైద్యుల సహకారం తో గర్భ విచ్చిత్తులు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సెంటర్ల యజమాన్యాలే భ్రూణ హత్యలకు పరోక్షంగా కారణమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి..

స్కానింగ్ పేరిట దోపిడీ..

గర్భంలో శిశువుకు ఏదైనా ఇబ్బందులు పొంచి ఉన్నప్పుడు మాత్రమే స్కానింగ్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ ధన దాహంతో కొందరు వైద్యులు చిన్న చిన్న సమస్యలకు స్కానింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేస్తున్నారు.. దీనితో గర్భంలో పెరిగే ఆడ మగ శిశువు అనేది అప్పుడే తెలుసుకోవడంతో భ్రూణ హత్యలకు తావిస్తోంది. ఒక్కో స్కానింగ్ కు 3000వేల నుండి 4000 దండుకుంటున్నారు.. రెడ్డి బజారులోని రెండు హాస్పిటల్స్ స్కానింగ్ సెంటర్లు నడుస్తున్నాయి.. ఈ రెండింటిలో ఓ స్కానింగ్ సెంటర్లో రోజుకు సుమారు 30 నుండి 40 స్కానింగ్ పరీక్షలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. స్కానింగ్ మిషన్స్ ఒకరి పేరునఉంటాయి నిర్వహించడం మాత్రం అర్హతలు లేని డాక్టర్స్ లేదా డాక్టర్ అమ్మ.ఇదే బజారులో ఓ సర్జన్ దందా మొత్తంగా గర్భవిచ్చిత్తి దుకాణమే అనే టాక్ నడుస్తోంది.ఈ తతంగం మొత్తం జిల్లా కేంద్రంలో శరా మాములు కావడం,జిల్లా ఆరోగ్య అధికారులు నియంత్రించ లేకపోవడం, కేంద్ర రాష్ట్ర విభాగాలు వచ్చి ఆకస్మిక తనిఖీలు చేయగా తీగ లాగితే డొంక కదిలినట్లు అయ్యింది..

బ్రూణహత్యా నిరోదక కమిటీల తీరు ఆశాజనకంగా ఉండాలి…

ముఖ్యంగా మహిళా శిశువు సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు రెవెన్యూ,శాఖల అధికారులు జిల్లా కేంద్రంలోని స్కానింగ్ సెంటర్ లపై ప్రత్యేక నిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.. ఆ కమిటీలు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కు భయం ఉంటుంది.. కాని లేకపోవడం వెనుక క్షేత్ర స్థాయిలోవారి పర్యవేక్షణ లేక పోవడం, అక్రమ స్కానింగ్ సెంటర్ లను సీజ్ చెయ్యక పోవడం వలన. ఆరోగ్య అధికారుల, మరియు ప్రత్యేక కమిటీ ల చిత్త శుద్ధి పై పలు అనుమానాలకు తావిస్తోంది.కనీసం కేంద్రం రాష్ట్ర బృందాల ఆకస్మిక తనిఖీల తోనైనా అధికారులు అప్రమత్తం అవుతూ..జిల్లా కేంద్రం లోని స్కానింగ్ సెంటర్ ల దందాను. మరియు ఎలిజిబులిటీ లేకుండా అడ్డగోలు డయాగ్నసిస్ లు రిపోర్టులు ఇస్తూ జనాన్ని బురిడీ కొట్టించే డాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా!లేదో వేచి చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *