మిన్నంటిన రెడ్యాల బ్రహ్మోత్సవ సంబురాలు..
–రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి సతీమణి బిందు యువ పుణ్య దంపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగిన బ్రహ్మోత్సవం
— అత్యంత శక్తివంతమైన వేదమంత్రోచ్చరణ నడుమ సుదర్శనహోమం
— గ్రామం ఆబాల గోపాలం అత్యంత ఆసక్తి తో కన్నుల పండుగ గా ముగిసిన సీతారామ కల్యాణమహోత్సవం..
తొలి సమయం ప్రధాన ప్రతినిధి మహబూబాబాద్7:
తన ఊరు, ప్రజలతో పాటు తన కుటుంబం మరియు సభ్యులు,పశుపక్షాదులు ఆయురారోగ్యాలతో ఉండాలని, నిత్యం ధనధాన్యాలతో తులతూగాలని లోక కళ్యాణం కోసం,జగత్ రక్షణార్ధంగా రెడ్యాల గ్రామంలో శనివారం రాత్రి సీతారామాలయంలో, బ్రహ్మోత్సవాలు 4వ రోజుకు చేరాయి. పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, సతీమణి బిందు యువ పుణ్య దంపతుల నేతృత్వంలో సుమారు 20 మంది వేదం బ్రాహ్మణ పండితులచే సుదర్శన హోమం, సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమ ఘట్టాలు పూర్తి అయ్యాయి. సుదర్శన హోమం అత్యంత శక్తివంతమైన వేదమంత్రోచ్ఛరణ నడుమ. పరిపూర్ణమైన ధార్మిక వాతావరణ, పవిత్రతను సంచరించుకున్నది.రెడ్యాల గ్రామపరిసరాల్లో వేదమంత్రాల శబ్దం అణువణువున నిండింది. గ్రామంలోని ఆబాల గోపాలం బ్రహ్మోత్సవాల్లో ఆసక్తిగా పాల్గొన్నారు.. సీతారామ కళ్యాణ మహోత్సవంలో సీతమ్మ అప్పగింతల సందర్బంగా బ్రాహ్మణోత్తములు చేసిన నాట్యం గ్రామ మహిళలు వేసిన కోలాటం కార్యక్రమం అత్యంత ఆసక్తిని ఆకర్షనను సంతరించు కొన్నది.. ఈ కార్యక్రమం లో శాసనసభ్యులు భూక్యా మురళీ నాయక్, సతీమణి మాజీ మున్సిపాలిటీ చైర్మన్ ఉమా మురళీ నాయక్, బీజేపీ అధికార ప్రతినిధి ఇందుభారతి పాల్గొన్నారు