దాదాపు గా వీడిన వాజేడు ఎస్సై ఆత్మహత్య మిస్ట్రీ…

దాదాపు గా వీడిన వాజేడు ఎస్సై ఆత్మహత్య మిస్ట్రీ…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం మహబూబాబాద్ :

నన్ను నువ్వు శారీరకంగా వాడుకోవడం వల్లే ప్రెగ్నెంట్ అయ్యాను.. కోటి రూపాయలు ఇస్తే నాకు ఓకే.. ఎవరికి ఏం చెప్పను.. లేకపోతే కేస్ పెట్టి పరువు తీస్తా.. నీ పెళ్లి కాకుండా అడ్డుకుంటా’*

అని యువతి భయపెట్టడంతోనే తీవ్ర మనస్తాపం చెంది వాజేడు ఎస్ఐ సూసైడ్‎కు పాల్పడినట్టు పోలీసుల ఎంక్వైరీలో వెల్లడైనట్టు తెలిసింది. గత సోమవారం ఉదయం వాజేడు రిసార్ట్స్ రూమ్‎లో ఎస్ఐ హరీశ్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయిన విషయం తెలిసిందే. ఘటన సమయంలో ఆయనతో ఉన్న యువతి అనంతరం పరారైంది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు తెలిసినట్టు సమాచారం.

*వివరాల్లోకి వెళ్తే..* సూర్యాపేట జిల్లాకు చెందిన ఆ యువతి కొంతకాలం కింద *ఎస్ఐ హరీశ్‎కు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై..* అనంతరం అతనికి దగ్గరైనట్టు తెలిసింది. ప్రేమ పేరుతో నటించి ఎస్ఐతో శారీరక సంబంధం పెట్టుకుని, డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసినట్లు సమాచారం. *ఇంతకుముందే ఆమె సూర్యాపేట జిల్లా చిలుకూరు పీఎస్, కోదాడలో, హైదరాబాద్ ఎల్ బీ నగర్, హయత్ నగర్ పీఎస్ పరిధిలో కూడా మోసం చేశారని పలువురిపై ఆమె కేసులు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది.*
కాగా.. హరీశ్ సుసైడ్ ఘటన జరగడానికి *ఒకరోజు ముందు ఆమె మరో వ్యక్తితో కలిసి వాజేడుకు వచ్చినట్టు* పోలీసులకు ఆధారాలు లభించాయి. ఎస్ఐ హరీశ్‎కు వేరే యువతితో పెండ్లి సంబంధం కుదరడంతో అతడిని బెదిరిస్తే డబ్బులు బాగా వస్తాయని ప్లాన్ చేసి *ఆదివారం రాత్రి రిసార్ట్స్‎లో ఎస్ఐతో గడిపి, సోమవారం ఉదయం తన ప్లాన్ వర్క్ ఔట్ చేసుకునేందుకే గొడవ పడినట్టుగా తెలిసింది.* ఆమె ఎస్ఐను రూ. *కోటి డిమాండ్ చేయగా.. రూ. 30 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకోగా.. ఆమె ససేమిరా అంటూ.. గొడవ చేయడంతో* తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్ఐ ఆమెను బయటకు పంపించి, అనంతరం *ఆత్మహత్య చేసుకుని ఉంటాడని’* పోలీసుల ఎంక్వైరీలో తేలినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ములుగు ఎస్పీ శబరీశ్‎ను వివరణ కోరగా.. ఎస్ఐ హరీశ్ సూసైడ్‎కు.. ఆ యువతికి మధ్య సంబంధం ఉన్నట్టు ఆరోపిస్తూ హరీశ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. ఆ కోణంలోనే ఎంక్వైరీ చేస్తున్నామని *ఒకటి, రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ చెప్పారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *