*ఖమ్మం లో శబరి ఫైనాన్స్ వారి అరాచకం*
తొలి సమయం ఖమ్మం డిసెంబర్ 3:
మొన్న ఈ మధ్యలో ఫైనాన్స్ వారి ఇబ్బందులు తట్టుకోలేక కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్న కస్టమర్ విషయం మరవక ముందే మరొక ఫైనాన్స్ వారి దారుణం..
ఈరోజు మంగళవారం ఉదయం ఇంటి ముందల పార్కు చేసిన బండిని ఎత్తుకెళ్లిపోయారు. తర్వాత కస్టమర్ నాగేశ్వరావు చుట్టుపక్కల వెతకగా ఫైనాన్స్ వారు తీసుకెళ్లారని చెప్పారు. ఫైనాన్స్ వారికి ఫోన్ చేసి అడగగా ఆఫీస్ కి రండి మాట్లాడదామని పిలిపించారు.. కస్టమర్ కి చెప్పకుండా బండి ఎందుకు తీసుకెళ్లారు అని అడగగా..వాళ్ళు నోటికి వచ్చినట్టు దుర్భాషలాడుతూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మా రూల్స్ ఇంతే అని మాట్లాడారు దానితో వాదన పెరిగి అందులో పని చేస్తున్న మహిళ కఠోరంగా మాట్లాడుతూ.. డబ్బులు కట్టడం చేతగానప్పుడు మీకెందుకురా బండ్లు అని బూతులు తిట్టడం మొదలు పెట్టింది, కస్టమర్ తో వచ్చిన గ్యారెంటర్ ను కూడా కులం పేరుతో దుషించారని మాట మాట పెరిగింది దానితో కస్టమర్ మరియు ఫైనాన్సు వారు వాగ్వాదానికి దిగారు.. ఫైనాన్స్ ఆఫీస్ లో పనిచేస్తున్న మహిళ దారుణంగా చెప్పుతో కొట్టడం మొదలుపెట్టింది. దానితో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.