సారీ నాన్నా అమ్మని చంపేశా..
— మంత్రాలు చేస్తూ తనను కెనడా వెళ్లకుండా అడ్డుకుంటుందని ఓ కుమారుడి ఘాతుకం
తొలి సమయం మహబూబాబాద్ నవంబర్ 10:
సారీ నాన్న! అమ్మను చంపేశా! ఓ తండ్రి తో పెద్ద కుమారుడు అన్న మాటలివి, హత్యకు కారణం కెనడా వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా, మంత్రాలు వేస్తోందని అనుమానించడం…. ఢిల్లీలో జరిగిన ఈ దారుణం కలకలం రేపుతుంది నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి బుధవారం సాయంత్రం తీవ్ర గాయాలతో ఉన్న ఓ మహిళను తీసుకువచ్చారు. పరిస్థితిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసు బృందం ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకొని సంఘటన జరిగిన జైత్పూర్ కు వెళ్లారు, దర్యాప్తు జరిపిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి, 31 ఏళ్ల క్రిషన్ కాంత్ తన తల్లిని కత్తితో పొడిచి చంపాడు. వెంటనే ఇంటికి రావాలని తన తండ్రి సూర్జిత్ కు ఫోన్ చేసాడు ఆయన వచ్చి చూసేసరికి క్రిషన్ క్రాంత్ కనిపించాడు. క్షమించండి నాన్న అని వేడుకున్నాడు మొదటి అంతస్తు ఇంటిలోకి వెళ్ళాడు తండ్రి ఇంట్లోకి రావాలని బయట నుంచి గొళ్ళెం వేసి పారిపోయాడు ఇంట్లో తన భార్య రక్తపు మడుగులో పడి ఉండడం చూసి నిర్గంత పోయాడు పురుగు వారి సాయంతో తలుపు తీయించి ఆమెను హాస్పిటల్ కు తరలించారు అప్పటికే ఆమె ప్రాణం కోల్పోయింది. క్రిస్టియన్ కాంతును పోలీసులు అరెస్టు చేశారు మారక ద్రవ్యాలకు అలవాటు పడ్డ క్రిషన్ కాంత్ నిరుద్యోగి, కెనడా వెళ్లి ఉద్యోగం చేసుకోవాలని ఆయన లక్ష్యం తల్లి గీత మాత్రం వ్యతిరేకించింది దీంతో మంత్రాలు వేసి తన కెనడా ప్రయాణాన్ని తల్లి అడ్డుకుంటుందని అనుమానం పెంచుకున్న క్రిషన్ ఆమెను చంపేశాడు