రాహుల్ గాంధీకి సూటి ప్రశ్నలు సంధించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్…
తొలి సమయం డెస్క్ హైదరాబాద్ నవంబర్ 7:
కుల గణనపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీ పై పలు సూటి ప్రశ్నలు సందించడం దేశంలో ఆసక్తికర అంశంగా మారింది.. దేశాన్ని 65 ఏళ్లుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు కుల గణన చేయలేక పోయింది అని సూటిగా ప్రశ్నించారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణనతో వాళ్ల జీవితాలు మారుతాయా, బాగు పడతాయా అని నర్మగర్బంగా మాట్లాడారు. అసలు కులగనలతో పేదరికం పోతుందా అని ఒక అడుగు ముందుకేసి ప్రశ్నించారు, కులగనన జరిగిన బీహార్ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఎందుకు మారలేదు అని అన్నారు.. కుల గణన కంటే ముందు దేశంలో పేదరికం పోవాలంటే మౌలిక ప్రత్యామ్నాయం విధానం పై దృష్టి సారించకుండా, కులగణన అనేది ఉత్త భ్రమ అని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయంగా తెలుస్తోంది!