ఆ హెచ్చరికే…హాట్ టాపిక్

ఆ హెచ్చరికే…హాట్ టాపిక్

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

— జైలుకు పంపుతాం.

ఎమ్మెల్సీ తక్కెల్లపెల్లి రవీందర్ రావు

తొలి సమయం ప్రధాన ప్రతినిధి మహబూబాబాద్ అక్టోబర్ 26:

: వామపక్ష విప్లవోద్యమాలకు. అనేక సామాజిక ఉద్యమాలతో పాటు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ.. మానుకోట చరిత్ర దేశం లోనే చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్నది అనడానికి అతిశయోక్తి కాదు, లేదు కూడను,దీనికి తోడుగా.. ఉభయ కమ్యూనిస్టులకు మరియు వారి ఉద్యమాలకు పుట్టినిల్లు కూడాను.ఇది ఇలా ఉంటే.. గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఇంత చైతన్యం ఉన్న మానుకోటలో సుమారు మూడున్నర వేల ప్రభుత్వ భూములతో పాటు.. అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి, మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా ల్యాండ్ గ్రాబింగుకు గురైన జిల్లాగా నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక కూడా పోయినట్లు సమాచారం ఇది గమనార్హం గత పది సంవత్సరాలు ప్రతిపక్ష గొంతుకలు అంతంత మాత్రంగానే ఉన్నాయి… అవినీతి అధికారులను పెద్దగా ఎవరు మందరించలేదు అనే విమర్శలు ఉన్నాయి.. ప్రభత్వం మారింది, కబ్జా అయిన చెరువులు,భూములను ఇంచు ఇంచు పోనీయకుండా రికవరీ చేస్తామన్న కాంగ్రెస్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ మాటలు మానుకోట ప్రజలకు కొంత ఊరటనిచ్చినా..! కొన్ని శాఖల పని తీరుమాత్రం మారలేదు, గత ప్రభత్వం తొవ్వలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తోంది.. ఇసుక, మట్టి, మైనింగ్ దందాల్లో జిల్లాలో పెద్దగా మార్పు రాలేదు. అనే విమర్షలు ఉన్నయి,ఈ సమయం లో..ఎమ్మెల్సీ తక్కెల్లపెల్లి రవీందర్ రావు మానుకోట అధికారులకు చేసిన హెచ్చరిక 10 సంవత్సరాల తర్వాత ప్రతిపక్షానికి నాంది పలికినట్లు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు… వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు క్యాంపు కార్యాలయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విధానంపై ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు.. ఇదే సందర్భంగా.. గత పది ఏళ్లలో అవినీతికి పాల్పడిన అధికారులు మళ్లీ మానుకోటకు తిరిగి వస్తున్నారు అన్నారు అలాంటి లంచగొండు అధికారులకు మానుకోట ఆలవాలమై పోవడానికి కారణం ఎవరు అని ప్రశ్నించారు.. మళ్లీ అదే విధంగా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే జైలుకు పంపిస్తామని నిప్పులు చెరిగారు.. ప్రతిపక్షంగా ఒక బలమైన గొంతుకకు నాంది పలికారని, జిల్లా ప్రజల్లో సర్వత్రా ఎమ్మెల్సీ రవీందర్రావు హెచ్చరిక ఒక హాట్ టాపిక్ గా మారింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *