కాంగ్రెస్ గూట్లో బిఆర్ఎస్ రాబందులు..
—ఎమ్మెల్యే, మరియు జంపింగ్ జపాంగ్ లను బట్టలు ఊడబీకి తరుముతాం అంటున్న నెల్లికుదురు కాంగ్రెస్ సీనియర్ శ్రేణులు
— పగులుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల గుండెలు
తొలి సమయం ప్రధాన ప్రతినిధి మహబూబాబాద్ అక్టోబర్ 18: కలిసి వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడు అంటారు పెద్దలు. పిలిచి పిల్లనిస్తే అల్లుడికి చులుకనైనట్టు అనే సామెత లాగా ఉన్నది మానుకోట జిల్లా కాంగ్రెస్ పరిస్థితి.. టిఆర్ఎస్ దోపిడికి వ్యతిరేకంగా తిరగబడ్డ జనానికి, రేవంత్ రెడ్డి మాటల తూటాలు, రాహుల్ జూడో యాత్ర తోడయ్యింది. 50 వేల పైచిలుకు ఓట్లతో మానుకోట నియోజకవర్గంలో. కాంగ్రెస్ జెండాను ఊరురూ,పల్లె పల్లె రెపరెపలాడించారు అలాంటి తిరుగుబాటు ఉద్యమ రూపంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ జనాన్ని గెలిపించిన నాయకులను. గెలిచాక పక్కన పెట్టేస్తోంది అని ఆరోపణలు వినబడుతున్నాయి,చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు, కొత్త సీసాలో పాత సారాయి లాగా
కాంగ్రెస్ గూట్లోకి. టిఆర్ఎస్ వలస రాబందులు చేరాయిఅని, నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు నిప్పులు జరుగుతున్నారు.ఏకంగా ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, మరియు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన బిఆర్ఎస్ జంపింగ్ లను బట్టలూడదీసి, పొలిమేర దాటిస్తామని నెల్లికుదురు మండలంలోని సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరికలు చేస్తున్నారు..
వివరాల్లోకెళ్తే.. పథకాలు అర్హత కలిగిన పేదలకు చేరాలి అనే ఉద్దేశంతో నీతిమంతులతో కూడుకున్న ఇందిరమ్మ కమిటీ నిర్మాణాలకు సెలవిచ్చింది అధిష్టానం,ఏడుగురు సభ్యులతో కూడుకున్న ఇందిరమ్మ కమిటీని కాంగ్రెస్ శ్రేయోభిలాషులు, నాయకులు కార్యకర్తల సమన్వయంతో వేయాలి అనేది అధిష్టానం ఉద్దేశ్యం,
కానీ మానుకోట నియోజకవర్గంలో అందుకు విరుద్ధంగా జరుగుతోందని. కడుపు మంటతో రగిలిపోతున్నారు. కాంగ్రెస్ శ్రేణులు. కష్టపడ్డది ఎవరు ప్రతిపక్షంగా ధర్నాలు రాస్తారోకోలు చేసింది ఎవరు?. టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై గుంతెత్తింది ఎవరు! కష్టపడి పోరాటం చేసింది ఎవరు! అవేమీ పరిగణలోకి తీసుకోకుండా.. బిఆర్ఎస్ అవినీతి సొమ్ముని కడుపునిండా ఆరగించిన ఉత్త అవినీతి సత్రోలు శరీరాలు ఆయారామ్ గయారామ్ లనే మళ్లీ ముందు పెట్టి ఇందిరమ్మ కమిటీలను వేస్తున్నారని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు, నెల్లికుదురు మండలంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి. సిహెచ్ వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొమ్మాల్ రెడ్డి తనయుడు యాదవ రెడ్డిలు. వీరిద్దరితోపాటు నెల్లికుదురు మండల అధ్యక్షులు మీడియావేదికగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మురళి నాయక్. టిఆర్ఎస్ పార్టీలో ఇసుక దందా. గుట్కా దందా గంజాయి దందా. కాంట్రాక్టు మాఫియా జోక్యంతో వేసిన ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు , వ అలాకాకుండా వైఖరిమార్చుకోకుండా ఉంటే,
*బట్టలు ఊడదీసి పొలిమేర* *దాటిస్తాం అని హెచ్చరిక చేస్తున్నారు*
ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ గత పది ఏళ్లు అధికారాన్ని కోల్పోగా తిరిగి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. మౌలికమైన పార్టీ నిర్మాణానికి నడుము కట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.. ఇటీవల ఉద్యోగులకు నియామక పత్రాలు ఇస్తూ మంచి యువకులను. నాయకులను అందించండి అని సందేశం ఇచ్చారు. కానీ అందుకు విరుద్ధంగా మానుకోటలో జరగడం గమనార్వం, అయితే ప్రజలు టిఆర్ఎస్ పది సంవత్సరాల సమయం ఇచ్చారు,ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని అప్పుల చిప్పగా చేసి కాంగ్రెస్ కు ఇచ్చారు. ప్రజలుఆ పార్టీని ఓడించడానికి ప్రజలకు పదేళ్లు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి ఇలాగే ప్రవర్తిస్తే మూడేళ్లు కూడా దాటనివ్వరని హెచ్చరిక చేశారు మానుకోట కాంగ్రెస్ లో కార్యకర్తలు సీనియర్ నాయకులు. కాంగ్రెస్ శ్రేయోభిలాషుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా మళ్లీ కొత్త సీసాలో పాత సారాయిలాగా.. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు
మళ్లీ కాంగ్రెస్ గూట్లోకి టిఆర్ఎస్ రాబందులు చేరుతున్నారని, నిరసన గళాలు వినిపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో అన్ని మండలాల్లోని సీనియర్లు కార్యకర్తలు భిన్నాభిప్రాయాలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి..