ఇసుక దందా పై రెవిన్యూ, మైనింగ్ అధికారుల బాధ్యతల పై అనుమానాలు..
వోల్టా చట్టం మార్గదర్శకాలను అటకెక్కించిన రెవిన్యూ,మైనింగ్ అధికారులు
— ఇసుక మాఫియాకు కాసుల కురిపిస్తున్న ఆకేరు ఇసుక
తొలి సమయం మహబూబాబాద్ అక్టోబర్ 8: ఇసుక దందా జిల్లా మొత్తంగా వ్యవస్థీకృత నేరంగా తయారు అయ్యింది. వరద బీభత్సంతో డోర్నకల్ నియోజకవర్గ మొత్తం ఉక్కిరిబిక్కిరి అయింది. దాంతో పాటుగా ఇసుక మేటలు ఆకేరుకు ఇరువైపులా గుట్టలు గుట్టలుగా పేరుకున్నాయి. ఆకేరు ఒడ్డు మొత్తంగా ఇసుక మేటలు గుట్టలుగా విస్తారంగా ఏర్పడ్డాయి.. ఇసుకను అమ్ముకోవడం కోసమే.. రైతులు పొలాల లాగా మళ్లను ఏర్పాటు చేసుకొని పొలాలు ఇసుకతో నిండాయి అని కారణాలు చూపెడుతున్నారు… యోగ్యత లేని నిరుపయోగంగా ఉన్న ఏటి ఒడ్డును పొలం అంటూ నమ్మిస్తున్న రైతుల ద్వారా ఇసుక మాఫియా కు కాసులు కురిపిస్తున్నాయి.. గత 15 రోజుల నుండి.. గుండ్రాతిమడుగు అడ్డరోడ్డు బంచరాయి తండా సమీపంలో ఆకేరు ఇసుకను రాత్రింబవళ్లు అడ్డు అదుపు లేకుండా తరలిస్తున్నారు.. పల్లెటూర్లలో ఈజీ మనీ కి అలవాటు పడిపోతున్న కూలీలు వ్యవసాయ పనులలను నిర్లక్ష్యం చేస్తూ.. ఇసుక దందాకు ఉపయోగపడుతున్నారు,పొద్దంతా పనిచేసిన 500 రావు కానీ రేయి పగళ్ళు ఇసుకను ట్రాక్టర్ ట్రక్కులు నింపితే రోజుకు 2000 ఆదాయం ఉంటుంది.. కనుక అక్రమ ఇసుక లో ఉన్న మజా వ్యవసాయంలో లేదు.. కాబట్టి వ్యవసాయ రైతులకు కూలీలు దొరకక పోవడానికి కారణం ఇసుక మాఫియానే అనేది తెలుస్తోంది,బంచరాయి నుండి ఇసుకను కొరివి
మహబూబాబాద్, బయ్యారం మండల కేంద్రాలు, గ్రామాలకు తరలిస్తున్నారు..ట్రాక్టర్ ఒక్కంటికి 5000 రూపాయలు పోగేసుకుంటున్నారు..
*పర్యావరణము ప్రకృతి గ్రౌండ్ వాటర్ కు రక్షణ కవచంగా ఉన్న వోల్టా చట్టం*
మార్గదర్శకాలను అధికారులు ప్రజలను చైతన్య పరచడంలో వైఫల్యం చెందడం మూలంగానే.. మట్టి, ఇసుక మాఫియా చెలరేగిపోతున్నట్లు పర్యావరణ ప్రేమికులు భావిస్తున్నారు. రాత్రింబవళ్లు ట్రాక్టర్లు మోతతో తండావాసులు, గ్రామవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మితిమీరిన వేగంతో ట్రాక్టర్లు నడవడం మూలంగా. జనం యాక్సిడెంట్స్ భయంతో వనికి పోతున్నారు. ఈ అక్రమ తతంగమంతా అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నట్లుగా పలు అనుమానాలకు తావిస్తోంది, రెవెన్యూ,మైనింగ్ అధికారుల కనుసన్నల్లోనే ఇసుక మట్టి మాఫియా రెచ్చిపోతున్నట్లు జనం ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు..
ఇక మైనింగ్ అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయరు,వివరణ ఇవ్వరు. జిల్లా కార్యాలయానికి వెళితే ఎమర్జెన్సీ పని మీద వెళ్తున్నామంటూ వివరణ ఇవ్వకుండా దాటేస్తున్నారు.. బంచరాయి తండా సమీపంలోని ఆకేరు అక్రమ ఇసుక దందాపై కొరివి ఎమ్మార్వో ను వివరణ కోరగా… ఎస్సై కి సమాచారం ఇవ్వండి అని సింపుల్ గా చెప్పేస్తున్నారు.. కానీ పోలీసులు రెవిన్యూ మైనింగ్ అధికారులు ముందుండాలి ఆ తర్వాతనే మేముంటాము అని తెగేసి చెబుతున్నారు కళ్ళముందే వందలాది ట్రాక్టర్లు ఆకేరు నుండి ఇసుకను సజావుగా తరలిస్తూ ఉంటే.. కొరివి ఎమ్మార్వో ఏమీ తెలవనట్లే. నిమిత్తమాత్రులుగా మాట్లాడుతున్నారు.. కనుక రెవెన్యూ, మైనింగ్, అధికారులు దోబూచులాడకుండా, ఇరిగేషన్, ఆర్టిఏ మరియు పోలీస్ అధికారుల సమన్వయంతో ఆకేరు ఇసుక దందాను అరికట్టి… రాత్రింబవళ్ల ట్రాక్టర్ల మోతలతో ఇబ్బంది పడుతున్న జనం సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు… వోల్టా చట్టం మార్గదర్శకాల పై ప్రజల్లో చైతన్యంతో పాటు, అధికారులు తూచా తప్పకుండా పాటించే విధంగా కలెక్టర్ వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఇసుక మాఫియాను అరికట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు,