ఇక సెలవ్ అంటూ..బయలెల్లిన నూకల నరేష్ రెడ్డి అంతిమయాత్ర పురుషోత్తమాయగూడెం ఆద్యంతం శోక సాగరం…

ఇక సెలవ్ అంటూ..బయలెల్లిన నూకల నరేష్ రెడ్డి అంతిమయాత్ర పురుషోత్తమాయగూడెం ఆద్యంతం శోక సాగరం…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం మహబూబాబాద్ అక్టోబర్ 5 :జనహృదయనేత నూకల నరేష్ రెడ్డి శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. శనివారం ఉదయం ప్రజల సందర్శనార్థం పురుషోత్తమాయ గూడెంలోని తన మామిడి తోటలో పార్థివదేహాన్ని ఉంచారు.పురుషోత్తమాయగూడెం, ప్రజలు,అభిమానుల, కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులతో అణువణువు జనంతో పోటెత్తింది.. నరేష్ రెడ్డి అమర్ హే అంటూ అభిమానులు నినాదాలు, జేజేలు పలికారు రాష్ట్రంలోని మంత్రులు మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు, జనం పార్టీలకతీతంగా వ్యక్తిగత శ్రద్ధతో కదిలి నూకల నరేష్ రెడ్డి అంతిమయాత్రను అశ్రునయనాల మధ్య కొనసాగించారు. పురుషోత్తమాయ గూడెం ఆబాల గోపాలం అభిమాన నాయకున్ని కండ్లరా అంతిమంగా చూసుకున్నారు. ఇక సెలవంటూ బయలుదేరిన నరేష్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొని చితికి నిప్పు అంటించే వరకు మడమతిప్పకుండా నిల్చున్న దృశ్యం నరేష్ రెడ్డి పట్ల జనానికి ఉన్న అభిమానన్ని అజరామరణముద్రను తెలియ జేసింది.
మాజీ మంత్రి సత్యంవతి రాథోడ్ బోరున విలపించినతీరు అందరినీ కంటతడి పెట్టించింది..ఈ అంతిమ యాత్రలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్, ఎంపీ బలరాం నాయక్, శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉమా మురళి నాయక్.రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే మంత్రి, రెడ్యానాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యేపెద్ది సుదర్శన్ రెడ్డి.కడియం శ్రీహరి, కన్నెబోయిన రాజయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ మేరుగు సత్యనారాయణ, నూకల శ్రీ రంగారెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ గ్రంధాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి, రఘువీరా రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మార్నేని వెంకన్న, వైస్ చైర్మెన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అంబటి వీరభద్రం గౌడ్.ముక్కా లక్ష్మణ్ రావు, తదితర ముక్యులు అశేషజనం పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *