చుక్కల ఉదయ్ చందర్ మృతి సందర్బంగా,చాలినంత కాంగ్రెస్ జనసమీకరణ లేదు..

చుక్కల ఉదయ్ చందర్ మృతి సందర్బంగా,చాలినంత కాంగ్రెస్ జనసమీకరణ లేదు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

టౌన్ కాంగ్రెస్ లో మౌలిక మార్పు తో కూడిన నిర్మాణం?

తొలి సమయం చీఫ్ బ్యూరో మహబూబాబాద్ అక్టోబర్ 2:

పదేళ్ల బి ఆర్ఎస్ పాలనపై విసుగు చెందిన జనం తమ తమ జెండాలను పక్కకు పెట్టారు. రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఓట్ల యుద్ధం చేసిన జనం అటు మానుకోట నియోజకవర్గం, డోర్నకల్ నియోజకవర్గంలోనూ.. 50వేల పైచిలుకు ఓట్లతో విజయ డంకా మ్రోగించి మొత్తం రాష్ట్రంలోనే ఈ రెండు నియోజకవర్గాల ప్రజల రాజకీయ చైతన్యం భళా. అనిపించుకుంది.. కానీ అదే ఊపు అదే జోరును కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలోనూ.. ఐక్యతలోనూ,కనపడటం లేదు. అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరు శాసనసభ్యులు ఒక ప్రభుత్వం సలహా దారు ఉన్న నియోజకవర్గం లో ఇటీవల రాష్ట్ర అధికార ప్రతినిధి చుక్కల ఉదయ్ చందర్ మృతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు అతని పార్థివ దేహం వద్దకాని, అతని అంతిమయాత్రలో కానీ ఆశా జనకంగా లేకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ పరిగణలోనికి తీసుకోవలసి ఉంటుంది.. ఒక రాష్ట్ర నాయకుని హోదాలో మరణించిన చుక్కల ఉదయ్ చందర్ పాడే పై ముఖ్యమంత్రి సలహా దారులు, వేం నరేందర్ రెడ్డి తన జేబులోంచి కాంగ్రెస్ జెండాను తీసి కప్పే వరకు స్థానిక నాయకత్వానికి కనీసం సోయలేదు అని ఆరోపణలు ఉన్నాయి . ఒక బీసీ నాయకుడు, నిత్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసు వెంట ఉండేవారుచుక్కల ఉదయ్ చందర్, అయితే కాంగ్రెస్ పార్టీ జనం తో పోలిస్తే ఇతర సిపిఎం సిపిఐ, తెలుగు దేశం, మరియు మృతులు ఉదయ్ చందర్ వ్యక్తిగత అభిమానులు, ఉపాధ్యాయులు, ఇతరేతర కులసంఘాలు, సామాజిక ఉద్యమ సంఘ నాయకులు అంతిమ యాత్ర లో పాల్గొన్నారు, ఆమాత్రం పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు వ్యక్తిగత శ్రద్ధతో వచ్చారే తప్ప కాంగ్రెస్ శ్రేణులను బాధ్యతగా కదిలించిన నాయకుడు మాత్రం కనపడలేదు అని ఆరోపణలు వినపడుతున్నాయి.. ఎన్నికల ముందు మాత్రమే కాంగ్రెస్ హడావుడి చేస్తుంది, కేవలం గెలుపు ఓటమీలకు పరిమితమై కార్యాచరణను నెరవేరుస్తుంది. ఆ తర్వాత ఎవరి దారిని వారు వెళ్ళిపోతారు,కానీ బాధ్యతాయుతమైన నాయకులు, నిర్మాణం మాత్రం శూన్యం అనే విమర్శలు ఉన్నాయి, ఉదయ్ చందర్ అంతిమ యాత్ర కొనసాగింపు సందర్బం కాంగ్రెస్ కార్యకర్తల్లో మహిళల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ మరియు కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం. యువజన సంఘాలను కదిలించి మోట్వేట్ చేయవలసి ఉండే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోకపోవడం పై సర్వత్ర విమర్శలు కొనసాగుతున్నాయి..విద్యావంతుడు,విజన్ ఉన్న బీసీ నాయకులు , మంచి ఫాలోయింగ్ ఉన్న చుక్కల ఉదయ్ చందర్ మరణం సందర్బన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మంచి బాండ్ ను ఏర్పాటు చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వైపల్యం చెందింది,అనే విమర్శలు కాంగ్రెస్ పార్టీ ఇంటా బయట కొనసాగుతున్నాయి..ముక్యంగా జిల్లా కేంద్రం, టౌన్ కాంగ్రెస్ లో బలమైన, బాధ్యతాయుత నిర్మాణం, నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ గతము, వర్తమానము, భవిష్యత్తును బేరీజు వేసుకుంటూ.. భారత్ జోడో యాత్ర ను స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ఒక మౌలికమైన మార్పుకు నాంది పలుకుతూ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ మహిళా విభాగాలను ఆక్టివేట్ చెయ్యాలనే సూచనలు, విశ్లేషణలు పరిగణలోకి తీసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ కి శ్రీరామరక్ష, లేకుంటే భవిష్యత్ తరాలకు కాంగ్రెస్ ప్రశ్నార్ధకమే అనే అభిప్రాయాలు ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *