తగ్గేదే లేదు అంటున్న మాట్టి మాఫియా.

తగ్గేదే లేదు అంటున్న మాట్టి మాఫియా…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బడి ఈడు పిల్లలతో మట్టి దందా

లావని భూములు, గుట్టలు, ఫారెస్ట్ భూములే టార్గెట్

రైతుల పేరుతో మట్టి కోసం అవసరం లేని బావులు

బడా బాబుల మామిడి తోటలు వెంచర్ లను మట్టితో అడ్డు అదుపులేకుండా నింపేస్తున్నారు

*మానుకోటలో మట్టి మాఫియా వ్యవస్థీకృతమయ్యింది. గత పదేళ్లు నిరవధికంగా సాగిన మట్టి దందాతో పచ్చని చెట్లతో అలరించిన గుట్టలు మాయమై బోసిపోయాయి..* *వందలాది గుట్టలు సర్వనాశనమై జీవవైవిద్యం అంచనా వేయలేని నష్టానికి గురైంది.. సహజ సిద్ధమైన గుట్టలో నివసించే అనేకమైన పాములు* *పరిసరాల్లోని పల్లెల్లోని గ్రామాల్లోకి వచ్చాయి.. వాటిని వెంటాడి వెంటాడి గ్రామస్తులు* *చంపేస్తున్నారు.. ఉదాహరణకు బేతోలు గ్రామంలో జరిగిన ఓ అందమైన గుట్ట విధ్వంసం నిదర్శనమే సాక్ష్యంగా నిలుస్తుంది. బడి ఈడు పిల్లలతో దందా చేయడం గమనార్హం ప్రకృతి విధ్వంసానికి పాల్పడిన బడాబాబులు పిడికెడు మంది మాత్రం కోటేశ్వరుల కోసం అధికారులు చోద్యం చూడకుండా.. ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయాలని ప్రజలు* *కోరుకుంటున్నారువివరాల్లోకెళితే..*.
తొలి సమయం మహబూబాబాద్ అక్టోబర్ 2 : తాళ్లపూస పెళ్లి రోడ్డులోని ఫారెస్ట్ భూములు. లావని పట్టాలు, ప్రభుత్వ భూములను మట్టి మాఫియా టార్గెట్ చేస్తోంది.. రైతుల కోసమే.. వాళ్ల అవసరార్థమే బావులు తీస్తున్నామంటూ.. అనేకమైన బావులాంటి గొయ్యిలు తీస్తున్నారు.. ఆ తరువాత పెద్ద పెద్ద బండరాళ్లతో నింపుతున్నారు.. ఇదంతా అధికారుల కన్సన్నల్లోనే మట్టి మాఫియా చెలరేగిపోతుందని అనుమానాలకు తావిస్తోంది.. ఒక్కోసారి ఈ మాఫియా అధికారుల పేర్లను ఉచ్చరిస్తూ.. వాళ్ల అవసరార్థమే మట్టిని తోలుతున్నామని బుకాయిస్తున్నారు. ఇప్పటివరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ వెంచర్లలో మట్టిని నింపేశారు.. ఇప్పుడు ఆ వెంచర్ల లో పచ్చటి చెట్లు కరువైపోయి.. కాసుల కక్కుర్తి తో నోళ్లు తెరుచుకొని కూర్చున్నాయి.. ఇదంతా గతం.. మళ్లీ అదే వేగంతో మట్టి మాఫియా చెలరేగిపోతుంది గుట్టలు లావని పట్టాలు ప్రభుత్వ భూములను తోడేస్తున్నారు. తాళ్ల పూస పెళ్లి రోడ్డుకు ఇరువైపులా ఉన్న లావని పట్టాలు గుట్టలు ఫారెస్ట్ భూముల నుంచి మట్టిని తోడేస్తూ గత 15 రోజుల నుండి నిరవధికంగా ఓ బడా బాబు ఓం నారాయణ మామిడి తోటలో వందలాది ట్రాక్టర్లతో ఎత్తు వంపులను చదును చేస్తున్నారు….దుంప రవి వెంకన్న, దంప లక్ష్మణ్ అను వారి నేతృత్వంలో.. ఈ మట్టి దందా కొనసాగుతోంది.. ఆర్టీవో, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, శాఖల అధికారులు అక్రమ మట్టి దందాకు పాల్పడుతున్న జెసిబి లు ట్రాక్టర్ల యాజమాన్యాలను బాధ్యులుగా చేస్తూ చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు కొనసాగుతున్నాయి.. అధికారులు తూతో మంత్రంగాకాకుండా వారికి ఉండే మార్గదర్శకాలను ఆచరణలో పెట్టాలని కోరుకుంటున్నారు.. జెసిబి లు ట్రాక్టర్లను ఆర్టీవో ద్వారా సరియైన చర్యల తీసుకోవాలని కోరుకుంటున్నారు.. తూతూ మంత్రంగా ఫైన్స్ వేయడం ద్వారా మళ్లీ అదే జెసిబి లు అవే ట్రాక్టర్లు, నెంబర్ ప్లేట్లులేకుండా రోడ్లెక్కతాయి విమర్శలు ఉన్నాయి. సంబంధిత శాఖల అధికారులు స్పందించి మట్టి మాఫియాను నిరోధించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *