బడుగుల పక్షపాతి చుక్కల ఉదయ్ చందర్ ఇకలేరు..

బడుగుల పక్షపాతి చుక్కల ఉదయ్ చందర్ ఇకలేరు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం చీఫ్ బ్యూరో అక్టోబర్ 1: ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ,తొలితరం ఉన్నత విద్యావంతుడు, అదే తొవ్వలో తన స్ఫూర్తిని నడవడికలో అలవర్చుకుంటూ… మానుకోట బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా, నిరంతరం పేదోళ్లను ప్రేమించే చుక్కల ఉదయ్ చందర్ సోమవారం గుండె పోటుతో చికిత్స పొందుతూ.. హఠాత్ మరణం చెందారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీసీజె, ఎంసీజే పూర్తి చేశారు. వీటితోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు విద్యార్థి దశలో క్రియాశీల ఉద్యమ భావజాల ప్రేరణ కు ప్రభావితుడు అయిన చుక్కల ఉదయ్ చందర్. ప్రారంభంలో జర్నలిస్టుగా ఇండియా టుడే జీవితాన్ని ప్రారంభించారు.. ఆ తర్వాత 1982 నాళ్ళలో మానుకోట రాజకీయ పెనుమార్పులకు కారణమైన తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ముందున్నారు.. చుక్కల ఉదయ్ చందర్, ఆలోచనావిధాన సహచరుడు అడ్వకేట్, వంగ నాగేశ్వరరావుకు ఆత్మీయ అనుచరులుగా ప్రాణ సమాన మిత్రులుగా క్లాస్మేట్స్ వీరిద్దరూ.. 1982 నాళ్ళలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీల అభ్యుదయ భావాలు కలిగిన అరుదైన వ్యక్తులుగా మానుకోట తెలుగుదేశం పార్టీలో వారిదైన ప్రత్యేకముద్ర వేసుకున్నారు.. ఆ తర్వాత చుక్కల రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. తెలుగుదేశం పార్టీ దిగ్గజాలు, రావూరి వీరయ్య, కడియం శ్రీహరి, భూపతి మల్లయ్య లాంటి లీడర్ల సరసన దీర్ఘకాలికంగా కొనసాగారు.తెలుగుదేశం పార్టీలో మండల వైస్ ప్రెసిడెంట్ గా,కొంత కాలం జిల్లా ప్రెసిడెంట్, కొనసాగారు. ఎంపీటీసీగా కొనసాగారు, నిరంతరం తన న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.. తెలంగాణ ఉద్యమం తెచ్చిన పెనుమార్పుల్లో భాగంగా మారిన రాజకీయ సమీకరణాల కనుకూలంగా కాంగ్రెస్ లో చేరారు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.. కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ వేం నరేందర్ రెడ్డి కి అత్యంత సన్నితుడుగా,ఫాలోవర్ గా కొనసాగుతున్నారు.. పరిణతి చెందిన రాజకీయ నాయకుల్లో ఒకరైన చుక్కల ఉదయ్ చందర్ కు అవకాశాలు మెండుగా వచ్చినట్టే వచ్చిచేజారి పోతున్నాయి అనే చర్చలు కూడా ఉన్నాయి.. మానుకోట కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకుడుగా ఎదుగుతున్న క్రమంలో.. ఆయన స్థాయికి దగ్గ హోదా లభిస్తుంది, అని ప్రజల్లో ఒక ఆశ ఉద్భవించిన ఈ సమయంలో చుక్కల ఉదయ్ చందర్ మరణం మానుకోట బడుగు బలహీన వర్గాలకు తీరని లోటుగా కాంగ్రెస్ లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ శ్రేణులు భావిస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *