బయ్యారం సిఎంసీ (చౌదరి మైనింగ్ కంపెనీ ల్యాండ్) విషయం లో ఇక నుండి నాయొక్క ఇన్వాల్వ్ మెంట్ ఉండదు.
-బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి.
బయ్యారం (తొలి సమయం)
బయ్యారం సిఎంసీ స్థల రక్షణ కమిటీ పేరుతో గత పది సంవత్సరాలనుండి సిఎంసీ స్థలం విషయంలో ఎన్నో సమావేశలకు హాజరు కావడం జరిగింది గతం లో నాపైన 2022 లో బైండొవర్ కేసు కూడా అయ్యింది నాప్రేమేయం ఉంది అందుకే నా నా పేరు వుంది కానీ ఇక నుండి అట్టి స్థలం విషయం లో నన్ను ఎవరు కూడా ఇన్వాల్వ్ చేయొద్దని నేను కూడా ప్రత్యక్షముగా గాని పరోక్షముగా కానీ ఇన్వాల్వ్ మెంట్ ఉండదు అని మనవి గత పధి రోజుల క్రితం కూడా నన్ను నాతో పాటు కొంతమంది పేర్లతో జిల్లా ఎస్పీ కి ఇచ్చారు. దయచేసి అర్ధం చేసుకొని ఇట్టి వివాదం లోకి నన్ను లాగొద్దని ఇట్టి వివాదములో నాపేరు ప్రస్థావన కూడా రావొద్దని కోరుకుంటున్నాను.
ఇది నేను ఎవరికి బయపడి గాని ఎవరి ప్రలోబాలకి లొంగి కానీ తీసుకున్న నిర్ణయం కాదు అని మంచి మనసుతో అర్ధం చేసుకుంటారని కోరుకుంటున్నాను.