ఏచూరి సంస్మరణ సభా వేదిక పై ఎంపీ మల్లు రవి– కుర్చీతగువులాట

ఏచూరి సంస్మరణ సభా వేదిక పై ఎంపీ మల్లు రవి– కుర్చీతగువులాట

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

— బీజేపీ దేశాన్ని కబలిస్తోంది,

సమైక్యత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం,హక్కులు,సామాజిక న్యాయసూత్రాలకు విగాతం కలిగిస్తోంది.

— బీజేపీ పై పోరాటం చెయ్యాలి అనే వేదిక మొత్తంగా ఆధిపత్య కులాలతో నిండింది అనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి

 

తొలి సమయం మహబూబాబాద్22: దివంగత నేత సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభా వేదికై దళిత ఎంపీ మల్లురవికి సిఏం సెక్యూరిటీ మధ్య జరిగిన కుర్చీ తగువులాట.. దళిత బహుజనుల్లోనే బలమైన చర్చకు దారి తీయడానికి తెరతీసినట్లు అయ్యింది, సభమొత్తంగా బీజేపీని టార్గెట్ చేసింది సమైక్య స్ఫూర్తి దెబ్బతీస్తోంది, సామాజిక న్యాయ సూత్రాన్ని దెబ్బతీస్తోంది, హక్కులను హరిస్తోంది, రాజ్యాంగ విలువలను పాతరవేస్తోంది ప్రమాదం ముంచుకోస్తోంది అంటూ బీజేపీనే ఇతి వృత్తంగా చేసుకున్నారు మహా ఉపన్యాసాలతో రక్తి కట్టించారు..మరి బీజేపీ పై పోరాటం చెయ్యాలి అంటే అశేషంగా ఉన్న దళిత బహుజన శ్రేణులలను కలుపుకొని పోకుండా సాధ్యం కాదు అనే విమర్శలు విన పడుతున్నాయి. కాని వేదిక మొత్తం మెజారిటీగా ఆధిపత్యకులాలతో నిండిన సందర్బంలో ఒక్క దళిత ఎంపీ కుర్చీపై కూర్చోవడపై అభ్యన్తరం వ్యక్తం చేసిన సిఏం సెక్యూరుటీ అంశం రాష్ట్రం లో హాట్ టాపిక్ అయ్యింది. దేశంలోను రాజకీయ చర్చలకు దారి తీసేఅవకాశం ఉంటుంది అనే అభిప్రాయాలు, విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *