10 ఏళ్ల బిఆర్ ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం— మంత్రి సీతక్క:
—- ఒక్క డీఎస్సీ వేయలేదు
—4,500 స్కూల్స్ మూసివేశారు
— యువత జీవితాలు ప్రశ్నార్ధకం అయ్యాయి
తొలి సమయం, మహబూబాబాద్ 18: గత 10 ఏళ్ల బిఆర్ ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ నాశనం అయ్యిందని మంత్రి సీతక్క అన్నారు.. కంటైనర్ స్కూల్స్ కంటైనర్ స్కూల్స్ ను ఏజెన్సీ ప్రాంతాలు అయినటువంటి ములుగు జిల్లా లోని బంగారు పెళ్లి మరియు వెంకటాపురం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఫారెస్ట్ లో వైల్డ్ లైఫ్ నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయని.. కనుక విద్యార్థుల మరియు ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని కంటైనర్ హాస్పిటల్స్, కంటైనర్ పాఠశాలలకు కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసిందని.. అయితే పదేళ్ల నుంచి ఒక్క డీఎస్సీ వేయలేదు,ఉద్యోగాల భర్తీ జరగలేదని 4,500 స్కూల్స్ ను నిర్దాక్షిణ్యంగా మూసివేశారని అన్నారు.. డీఎస్సీ వేసి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు జీర్ణించుకోలేని టిఆర్ఎస్ పార్టీ వాయిదా పేరుతో కుట్రకు తెర తీసింది అని అన్నారు.పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో చదువు సత్తుబండలై విద్యార్థులు గాడి తప్పారని ఆవేదన.వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో. మహా -బాద్ జిల్లా ఎంపీ బలరాం నాయక్ భద్రాచలం ఎంపీ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర్ కంటైనర్ స్కూల్స్ కంటైనర్ హాస్పిటల్స్ ను ఓపెనింగ్ చేశారు…