నేతల అరెస్టుకు నిరసనగా ఫారెస్ట్ ఆఫిస్ సెంటర్ లో బిఆర్ఎస్ ధర్నా

నేతల అరెస్టుకు నిరసనగా ఫారెస్ట్ ఆఫిస్ సెంటర్ లో బిఆర్ఎస్ ధర్నా…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

—- ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పిఎసి ఛైర్మెన్ పదవి కాంగ్రెస్ లో చేరిన అరికె పూడి గాంధీకి ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తే అరెస్ట్ లు చేస్తారా!

—-ఇది ప్రజాస్వామ్యం పై కాంగ్రెస్ పార్టీ చేసిన దౌర్జన్యానికి నిదర్శనం,

ఎమ్మెల్సీ తక్కెల్లపల్లి రవీందర్ రావు
.
తొలి సమయం మహబూబాబాద్ సెప్టెంబర్13:

బిఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్టును ప్రజాస్వామ్యం పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యంగా ప్రజలు గమనించాలని ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు హితవు పలికారు. బిఆర్ ఎస్ నాయకుల అరెస్ట్ కు నిరసంగా జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ సెంటర్లో ఎమ్మెల్సీ త క్కెళ్ళపల్లి రవీందర్ రావు ఆధ్వర్యంలో ఓ అరగంట సేపు ధర్నా కార్యక్రమం కొనసాగింది.. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ టిఆర్ఎస్ నాయకులు శ్రేణులు నినాదాలు చేశారు … ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు రావలసిన పిఎసి( ప్రజా పద్దుల కమిటీ )చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ అరికెపూడి గాంధీకి ఎలా కట్టబెడతారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అన్నారు, అరికె పూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పు కొని నేను దేవుడి కండువా కప్పు కున్నానని డబుల్ గేమ్ ఆడారని అన్నారు నేను పార్టీ వీడలేదు అని కౌశిక్ రెడ్డి ని రెచ్చగొట్టారని అన్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయానికి ముందే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించడం ఎలా తప్పు అవుతుందని అన్నారు..ఈ ధర్నా కార్యక్రమం లో కొద్దిసేపు వాహనరాక పోకలకు ఇబ్బంది కలిగింది వెంటనే పోలీస్ ల సమన్వయం తో ధర్నా చల్లారింది ఈ కార్యక్రమం లో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న నాయకులు తేళ్ల శ్రీనివాస్ మంగళంపల్లి కన్నా, మర్నేని కిరణ్ జేరిపోతుల వెంకన్న. రంజిత్ కుమార్, అలవాల వెంకన్న, తప్పెట్ల వెంకన్న వార్డ్ కౌన్సిలర్ వేణు రఘు. యుగంధర్, వెంకన్న పాషా, రవికుమార్, తదితరులు మొత్తం 100 మంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *