మానుకోట గోలుసుకట్టుచెరువులు గోల్ మాల్

మానుకోట గోలుసుకట్టుచెరువులు గోల్ మాల్

కనుమరుగు కానున్న బంధం చెరువు, కంబాల చెరువులు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మున్సిపాలిటీ ఇర్రిగేషన్ రెవిన్యూ అధికారుల చేతివాటం

ఎఫ్ టీఎల్ భూములకు రిజిస్ట్రేషన్ లు

—శిఖం భూములకు రిజిస్ట్రేషన్ భూముల సర్వే నంబర్ తో బురిడీ రిజిస్ట్రేషన్ లు

తొలి సమయం మహబూబాబాద్ సెప్టెంబర్ 7:

మున్సిపాలిటీ అధికారులు అంటే కించెత్తు గౌరవం లేని పరిస్థితులు జిల్లా కేంద్రంలో నెలకొన్నాయి. ఎడతెరిపి కురిసిన వర్షాలతో మున్సిపాలిటీ బండారం బయట పడింది గొలుసు కట్టు చెరువుల ఆక్రమణ అంటే సరిపోదు దురాక్రమణ అంటే బాగుంటుంది చట్టం ఉన్నోడికి చుట్టం అంటే అదేదో సినిమా డైలాగులా కొంతమంది అపహాస్యం చేస్తుంటారు, కానీ మానుకోట చెరువులను కబ్జాలు పెట్టడం లో ఆ డైలాగే సజీవ సాక్ష్యంగా నిలిచింది, మానుకోట చెరువుల ఎఫ్ టీ ఎల్ బఫర్ జోన్ లే కాదు ఏకంగా శిఖంభూముల్లోఅక్రమంగా లే అవుట్ చేసారు అందులో మున్సిపాలిటీకి గ్రీన్ ల్యాండ్ గా చూపించి చేతులు దులువు కున్నారు విచిత్రం ఏమిటంటే మున్సిపాలిటీకి అప్పజెప్పిన గ్రీన్ ల్యాండ్స్ ను కూడ కనీసం మున్సిపాలిటీ అధికారులు కాపాడడం లో నిర్లక్ష్యం చేసారనే పవాదు మూట గట్టుకున్నారు కనీలు లేదా హద్దులు వేయకుండా గాలికి వొదిలేశారు.వాటిలో ఇప్పుడు అక్రమ నిర్మాణాలు ఏర్పడ్డాయి అనేది హాట్ టాపిక్ గా మారింది..రాజకీయాలకు అతీతంగా జనం ముందుకు వచ్చేంత తెగువ ప్రస్తుతం లేదు. ప్రకృతి ప్రకోపించి మానుకోట గొలుసు కట్టు చెరువుల గొలుసులు తెంపిడంలో సహకరించిన
మున్సిపాలిటీ, ఇరిగేషన్ రెవిన్యూ అధికారుల చేతివాటం బయట పడింది అనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

*బంధం చెరువు మానుకోట పేగు బంధం*
చెరువును చెర బట్టారు, దీనికట్ట కింద ఉన్న భూమిని చుట్టూ ఉన్న గుట్టలను తొవ్వి ఎర్ర మట్టితో నింపేశారు, బేతోలు గుట్టలు మొత్తం మానుకోట చెరువులు నింపారు. 307 సర్వే నెంబర్ లో ఉన్న బంధం చెరువు 32.24ఎకురాల విస్తీర్ణం.14.19ఎకురాలు విస్తీర్ణం అన్యాక్రాంతం అయ్యింది ఎఫ్ టీ ఎల్ పరిధిలో పట్టాభూమి 13.30 ఎకురాలుఉన్నది 302నుండి 314వరకు, 324నుండి 325,328,331,342,345,347లో గల పట్టా భూములు 307/2,307/1,సర్వే నంబర్ గల చెరువు శిఖం భూముల పక్కనే ఉన్నాయి..కనుక అక్రమార్కులకు బంధం చెరువును కరేన్సీ కట్టలుగా మార్చడానికి మొత్తం ప్రభుత్వ వ్యవస్థను చెదలు పట్టించారు, గజాల చొప్పున బిట్లు బిట్లుగా చేసి అమ్మేస్తున్నారు. ఇప్పటికే 3.15 ఎకరాల్లో భారీ అక్రమ కట్టడాలు నిర్మాణాలు ఏర్పడ్డాయి.

*కంబాల చెరువు*. జిల్లా కేంద్రంలోని 442 సర్వే నెంబర్లు ఉంటుంది 84.07 ఎకరాల విస్తీర్ణంలో చెరువు శిఖ భూమి ఉంటుంది. ఇది మానుకోట నడి బొడ్డులో ఉండడం వలన ఈ శిఖం భూముల విలువ పెరిగింది, కొందరు దళారులు రియాల్టర్లు,25 ఎకరాలకు పైగాఆక్రమించుకున్నారు. దర్జాగా లేఅవుట్ చేసి ఇందులోనే కొంత భూమిని గ్రీన్ ల్యాండ్ గా మున్సిపాలిటీకి అప్పజెప్పారు… కనీసం గ్రీన్ ల్యాండ్ ను కూడా మున్సిపాలిటీ అధికారులు కాపాడకుండా గాలికి వదిలేసినట్లు…ఇప్పుడు ఆ భూమి కూడా అన్యాక్రాంతమైనట్లు ప్రచారం వైరల్ అవుతుంది….చెరువుల కబ్జాలకు దళారులుగా వ్యవహరించిన వాళ్ళు ఎవరు! రియాల్టర్లు ఎక్కడ నుంచి ఉద్భవించారు! అధికారులను లొంగదీసుకుని మ్యానిఫ్లై చేసిన బడా బాబులు ఎవరు? అనే టాక్ నడుస్తోంది,హైడ్రా లాంటి మాడ్రా వస్తుందా!ఒక వేళ వస్తే అక్రమార్కుల రాజకీయ వత్తిళ్లకు నిలుస్తోందా అనే ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.. ప్రభత్వ ఆస్తులు, చెరువులు కుంటలు, డ్రైనేజ్ వ్యవస్థలు, నిజాం కాలం నాటి గొలుసు కట్టు చెరువులను పునర్వ్యవస్థీకరణ చేసి మానుకోట కు గత వైభవాన్ని తీసుకురావాలని అధికారులను పర్యావరణ ప్రేమికులు ప్రజలు కోరుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *