బ్రేకింగ్ న్యూస్…మానుకోటలో ఆదివాసీల ” అంతిమ సాంస్కృతిక ధర్మయుద్ధం ” భారీ బహిరంగ సభకు ఆదివాసి 9 తెగల జేఏసీ రూపకల్పన

బ్రేకింగ్ న్యూస్…మానుకోటలో ఆదివాసీల ” అంతిమ సాంస్కృతిక ధర్మయుద్ధం ” భారీ బహిరంగ సభకు ఆదివాసి 9 తెగల జేఏసీ రూపకల్పన

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మానుకోట జిల్లాలో ఆదివాసీ 9 తెగల ఉద్యమ కార్యాచరణను అడ్డుకోవడంలో భాగంగానే ఉద్యమ యువ నాయకుడు, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డా. మైపతి అరుణ్ కుమార్ అరెస్ట్ అని ఆరోపిస్తున్న ఆదివాసి 9 తెగల జేఏసీ..

ఉద్యమ నిర్మాణం, ఉద్యమ నాయకుల అరెస్టుకు నిరసనతో పాటు , చట్ట బద్దత లేని లంబాడీలను ST జాబితా నుండి తొలగించే కార్యచరణలో భాగంగానే ఈ రోజు కట్టుగూడెం గ్రామం, ఇల్లందు మండలంలో, వచ్చే జూన్ మొదటి వారంలో మానుకోటలో ఆదివాసీల “అంతిమ సాంస్కృతిక ధర్మయుద్ధం” భారీ బహిరంగ సభకు తీర్మాణం చేసిన ఖమ్మం,వరంగల్ జిల్లాల రిటైర్డ్ ఉద్యోగుల నాయకుల మేధోమధన సమీక్ష సమావేశం.

ఆదివాసి 9 తెగల జెఎసి రాష్ట్ర చైర్మన్ చుంచు రామకృష్ణ

తొలి సమయం, డెస్క్ హైదరాబాద్ మార్చ్ 29 :

తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఆదివాసీ ఉద్యమ నాయకులు మైపతి అరుణ్ కుమార్ ను ఈ నెలలో రెండు సార్లు అప్రజా స్వామిక, అక్రమ అరెస్టు లను ఖండిస్తూ.. ఆదివాసి 9 తెగల జాక్ చైర్మన్ చుంచు రామకృష్ణ నిప్పులు చెరిగారు భద్రాచలం ధర్మ యుద్ధ మహాసభ విజయవంతం అయిన తర్వాత మేడారం జాతరలో మహాసభకు ప్రకటన చేసి యుంటిమి, కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆ సభను మానుకోటలోనే నిర్వహించాలని నేటి ఖమ్మం, వరంగల్ జిల్లాల రిటైర్డ్ ఉద్యోగుల మేధోమధన సమావేశంలో చర్చించడమైనది. త్వరలో వరంగల్ రిటైర్డ్, ప్రస్తుత ఉద్యోగస్తులతో, ఆదిలాబాద్ జిల్లాలోని రిటైర్డ్ ఉద్యోగస్తులు, ఉద్యోగస్తులు,రాయి సెంటర్ పెద్దలతో కేస్లాపూర్ లో చర్చించిన తర్వాత , అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులతో, విద్యార్థులతో,మహిళలతో , తెగల పెద్దలతో పాటు కలిసి వచ్చే అన్ని సంఘాల నాయకులతో చర్చించి తుది నిర్ణయాన్ని ఏప్రిల్ నెలాఖరులో నిర్వహించే jac సమావేశంలో ఆదివాసీ 9 తెగల సాంస్కృతిక ర్యాలీ మరియు బహిరంగసభ తేదీని ప్రకటిస్తామని జాక్ చైర్మన్ చుంచు రామకృష్ణ అన్నారు..

భవిష్యత్తు ఉద్యమ కార్యచరణలో భాగంగా ఈ రోజు ఇల్లందు మండలం కట్టుగూడెం గ్రామంలో ఖమ్మం, వరంగల్ జిల్లాల రిటైర్డ్ ఉద్యోగుల ముఖ్యులతో మేధోమథన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులతో పాటు, జాక్ చైర్మన్ చుంచు రామకృష్ణ మాట్లాడుతూ…. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే ఉద్యమంలో , ఆధార్ సొసైటీ ఆద్వర్యంలో చేస్తున్న న్యాయపోరాటంలో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుండి అత్యున్నత గౌరవ సుప్రీంకోర్టు వేదికగా పోరాడుతున్నామని, అందుకు అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని అన్నారు, ఓటు బ్యాంకు ను ముందు పెట్టి అన్ని పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తూ ఆదివాసీల న్యాయమైన ఉద్యమ ఆకాంక్షను నీరు కార్చాలని గోర్ బంజారాలు ఆదివాసీ ఉద్యమ నాయకులను అక్రమ అరెస్టుల రూపంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అందులో భాగంగానే ఇటీవల తుడుండెబ్బ మహబూబాబాద్ జిల్లా కమిటీను వేయడానికి వస్తున్న డా. మైపతి అరుణ్ కుమార్ ను కురవి మండల కేంద్రం కు రానివ్వకుండ, ఆరోజు ఉదయం ములుగు జిల్లా పస్రాలో అరెస్టు చేశారన్నారు.. ఆ సంఘటనను యావత్ ఆదివాసీ సమాజం ఖండించినా వాళ్ళ వైఖరిలో మార్పు రాలేదు సరికదా, నేడు వారికున్న రాజకీయ బలంతో నేడు మార్చి 29 రోజున మానుకోట జిల్లా పెద్ద గూడూరులో జిల్లా కమిటీ వేయడంలో భాగంగా వస్తున్న ఉద్యమ నాయకులు అరుణ్ కుమార్ ను రెండవసారి బయ్యారం మండలంలో అరెస్టు చేశారన్నారు.. అయితే మానుకోట జిల్లా గోర్ బంజారాల సొంత రాజ్యంలా భావిస్తున్న గోర్ బంజారాలు నేడు అధికార బలంతో ,పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని తుడుండెబ్బ రాష్ట్ర అధ్యక్షుణ్ణి రెండు సార్లు అరెస్టు చేయడాన్ని ఆదివాసీ 9 తెగల జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.. ఈ అరెస్టు నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, అదే విధంగా గోర్బంజరాలను తొలగించకుండా, కాయిత మధుర లంబాడీలను, బోయ వాల్మీకులను ST జాబితాలో చేర్చడానికి చేస్తున్న రాజకీయ కుట్రలను అడ్డుకోవడానికి మేడారం లో జూన్ నెల మొదటి వారంలో నిర్వహించాలనుకునే మహాసభను, మానుకోటలో లక్ష మంది ఆదివాసీ తెగల ప్రజలతో జరుపతల పెట్టామని అన్నారు, త్వరలో జాతి ప్రయోజనాల కోసం పోరాడే అన్ని సంఘాల్లోని నాయకులు , తెగల ముఖ్యులతో చర్చించిన తర్వాత మానుకోట లో నిర్వహించబోయే ఆదివాసి తెగల “అంతిమ సాంస్కృతిక ధర్మ యుద్ధ” మహాసభకు ప్రకటన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధార్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కల్తీ వీరమల్లు గారు, ప్రొఫెసర్ డాక్టర్ ఈసం సారయ్య దొర, రిటైర్డ్ ఏఎస్పి, కురుసం సీతారాములు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కొమురం ప్రసాద్, రిటైర్డ్ అధికారులు చీమల సూర్య నారాయణ FM KTPS, జారే భిక్షం CI, చుంచ పాపయ్య ASI, సుంచ లక్ష్మీనారాయణ టీచర్, ఆలూరి సమ్మయ్య టీచర్, సిద్ధబోయిన వీరస్వామి రెవెన్యూ సూపరింటెండెంట్,సిద్ధబోయిన బాబు రావు సర్వే ఆఫ్ ఇండియా, కొమురం కనకయ్య టీచర్ లతో పాతి ఇల్లందు ప్రాంత తుడుం దెబ్బ నాయకులు మోకాళ్ళ సతీష్, పోలేబోయిన రామనర్సయ్య, తాటి వెంకటేశ్వర్లు, చింత జోగయ్య, ఖమ్మం విద్యార్థి నాయకులు బట్ట శ్రీకాంత్, చింతా నందు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *