ఇది ప్రజా ప్రభుత్వమా..లంబాడాల పక్షపాతమా..

ఇది ప్రజా ప్రభుత్వమా..లంబాడాల పక్షపాతమా..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*నామాల పాడు లో తుదిందేబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా.మైపతి అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు*

*బయ్యారం:*

నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం నుండి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం వట్టి వాగు వద్ద ఆదివాసి హక్కుల పోరాట సమితి “తుడుందెబ్బ” జిల్లా కమిటీ ఎన్నిక కార్యక్రమం కు బయలుదేరిన తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ కార్యనిర్వాహక అధ్యక్షులు ముక్తిరాజు రాష్ట్ర కార్యదర్శి ధారబోయిన రమేష్ లను బయ్యారం మండలంలోని నామాలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సిగ్నల్ ట్రేస్ చేసి భారీకేడు లను పెట్టి వెహికల్ ని నిలిపివేసి చెకింగ్ చేస్తూ ఈ సమావేశం కు ఆనుమతి లేదని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని మహబూబాబాద్ డిఎస్పి పర్యవేక్షణలో అరెస్టు చేయడం జరిగింది.

టెర్రరిస్టులను మావోయిస్టులను ఫోటోలను తమ దగ్గర పెట్టుకొని చెకింగ్ చేసి పట్టుకున్నట్టు తుడుం దెబ్బ నేతలను వాహనాలను తనిఖీ చేస్తూ ట్యాబులలో ఫోటోలు పెట్టుకొని మరీ అరెస్టు చేయడం జరిగింది

అరెస్టు చేసిన నేతలను ముందుగా నామాలపాడు పోలీస్ స్టేషన్లో పెడతారని భావించినప్పటికీ తదుపరి ఇల్లందు అని తదుపరి గుండాల పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నామని మళ్లీ తిరిగి ములుగు జిల్లాలోని పసర పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నామని ఇలా తిప్పుతూ చివరగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో వదిలేశారూ.

అనంతరం రాష్ట్ర నేతలు మాట్లాడుతూ ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లా కమిటీ ఎన్నిక కార్యక్రమాలు నిర్వహించడంలో తేదీ:22/03/2026 న మహబూబాబాద్ జిల్లా కమిటీ ఎన్నిక కురవి మండల కేంద్రంలో వీరభద్ర పంక్షన్ హాల్లో పెట్టడం జరిగిందని నాడు ముందు రోజు అనుమతి ఇచ్చిన కురవి పోలీసులు తెల్లవారి మీ సమావేశం కు పర్మిషన్ లేదని ఫంక్షన్ హాల్ పర్మిషన్ రద్దుచేసి సమావేశం నిర్వహించకుండ తాడ్వాయి పోలీస్ స్టేషన్ లోనే మైపతి.అరుణ్ కుమార్ ను అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. ఆ తేదీని వెనుక తీసుకున్న తుడుం దెబ్బ మరి యొక తేదీని ఆదివాసి ప్రాంతమైన భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ భూభాగ పరిధిలో ఉన్న గూడూరు మండల కేంద్రంలో నిర్వహణకు నేడు అనగా తేదీ: 29/03/ 2026 న సిద్ధమైన క్రమంలో మళ్లీ మీ సమావేశానికి అనుమతి లేదని అరెస్టు చేయటం నిర్బంధించడం దేనికి సంకేతము సమాధానం చెప్పాలన్నారు

భారత రాజ్యాంగంలో సమావేశాలు సభలు భావ ప్రకటన స్వేచ్ఛను ప్రకటించుకునే హక్కు లేదా ఒకవేళ ఉంటే అది అమలులో ఎందుకు లేదు దానికి పోలీస్ శాఖ ఎందుకు ఉల్లంఘిస్తుందో సమాధానం చెప్పాలన్నారు కేవలం 50 మందితో నిర్వహించుకునే సమావేశం కూడా ఆదివాసీల నిర్వహించుకునే స్వేచ్ఛ లేదంటే లంబాడీల దురహంకార చర్యలు రాజకీయ కుట్రలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలని అన్నారు మహబూబాబాద్ పోలీస్ శాఖ భారత రాజ్యాంగ హక్కుల ప్రకారం పరిపాలన చేస్తుందా లంబాడీల కుట్రలకు అనుకూలంగా పరిపాలన నడుపుతుందా సమాధానం చెప్పాలన్నారు.

మా యొక్క సంఘం సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ మాకు ఉన్నప్పటికీ నిర్బంధిస్తూ లంబాడీల పక్షాన చేరి ఇలా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు

లంబాడీల రాజకీయ కుట్రలు రిజర్వేషన్ల దోపిడి ఆదివాసి ప్రాంతాల్లోకి వలస అక్రమ వలస ఇవన్నీ కుట్రలను తిప్పి కొట్టే ఉద్యమ నిర్మాణం తుడుం దెబ్బ చేస్తుందని అన్నారు

ఆదివాసిలం చాలా ఓపికతో సహనంతో వ్యవహరిస్తున్నామని ఇలాంటి లంబాడీల కవ్వింపు చర్యలకు తానా అంటే తందానా అని పోలీస్ శాఖ వ్యవహరిస్తే అశాంతి ఏ విధంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించవలసి ఉంటుందని తుడుం దెబ్బ హెచ్చరించింది

ప్రజాస్వామికంగా స్వేచ్ఛాయుతంగా శాంతియుతంగా జరిగే మా పోరాటానికి అడ్డుగా వస్తే సహించేది లేదని తుడుం దెబ్బ పేర్కొంది

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము నడుపుతుంది ప్రజా పరిపాలన లేక లంబాడ పరిపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తె తెలంగాణ రాష్ట్ర మొత్తం సభలు సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చు అన్న ముఖ్యమంత్రి మహబూబాద్ జిల్లాలో ఆదివాసీలము మీటింగులు పెట్టుకునే స్వేచ్ఛ లేదా సమాధానం చెప్పాలన్నారు..

సుప్రీంకోర్టుకు లంబాడీలు ఎస్టీలే అని బాహాటంగా రిపోర్టర్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు చరిత్ర లేని సేవాలాల్ ని నెత్తిన ఎక్కించుకొనీ ఓట్ల కోసం మురిసిపోతుందని అన్నారు. 200 కోట్లతో మద్ది మడుగు లో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేసే కాంగ్రెస్ పార్టీకి నల్లమల్ల అడవిలో ఆకలి తో అలమటించే చెంచుల బతుకులు కనిపించడం లేదా అని అన్నారు

విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో తీవ్రంగా అన్యాయానికి గురవుతున్న ఆదివాసీలు నేడు ప్రశ్నించే హక్కును కూడా కోల్పోవడం దుర్మార్గమని అన్నారు

లంబాడీల తొలగింపు కోసం ఆదివాసీలు చైతన్యం కావాలని హక్కుల కోసం పోరాట మార్గం లో నడవాలని తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు నిస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *