ఆదివాసీ ఉద్యమ నాయకుడు మైపతి అరుణ్ అరెస్టు అప్రజాస్వామ్యం– ఆదివాసి జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ..
తొలి సమయం మహబూబాబాద్ మార్చి 29 :
ఆదివాసీ ఉద్యమ నాయకుడు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ అరెస్టును ఆదివాసీ జేఏసీ చైర్మన్ చెంచు రామకృష్ణ అప్రజా స్వామీకం అని నిప్పులు చెరిగారు. ఇటీవల కొరివి మండలంకేంద్రం లో ఉద్యమ కమిటీల నిర్మాణం కోసం సమీక్ష సమావేశం నిర్వహించుటకు బయలుదేరిన అరుణ్ కుమార్ ను ములుగు జిల్లా పస్రా లో అరెస్ట్ చేసారు. ఇదే క్రమం లో ఈ రోజు మార్చి 29 తారీకు ఉదయం ఇల్లందు మండలం కట్టుగూడెంలో నిర్వహిస్తున్న సమావేశనికి వొస్తున్న మైపతి అరుణ్ కుమార్ ను బయ్యారం
మండల పోలీసులు అరెస్టు చేయడం రెండవ సారి అన్నారు, చట్టబద్ధంగా ప్రజాస్వామ్య,రాజ్యాంగానికి లోబడి జరుగుతున్న ఆదివాసీ సంఘాల
సమావేశాలు, సమీక్షలను అడ్డుకోవడం అరెస్టు చేసే ప్రభుత్వ విధానాన్ని సబ్బండ ప్రజలు గమనిస్తున్నారని.. అరెస్టులు అంటే ప్రభుత్వానికి పోలీస్ లకు అత్యుత్సాహంగా మారిపోతుందని ఎద్దేవా చేశారు.. అరుణ్ కుమార్ ను ఎక్కడ రెస్ట్ చేశారో అక్కడికి తీసుకువచ్చి వెంటనే ఒప్పజెప్పి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చుంచు రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మరియు విద్యా ఉద్యోగ ఆదివాసి సంఘ నాయకులు పాల్గొన్నారు