పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 10 మంది దుర్మరణం, పలువురు గల్లంతు

*పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 10 మంది దుర్మరణం, పలువురు గల్లంతు*

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం, మహబూబాబాద్ మర్చి 26:

బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌలత్‌దియా ఘాట్ సమీపంలో 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా, 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

బస్సును ఫెర్రీపైకి ఎక్కించే సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం సుమారు 35 అడుగుల లోతున్న నదిలోకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి.

అనంతరం భారీ క్రేన్ సాయంతో బస్సును నది నుంచి బయటకు తీశారు. ఇంకా గల్లంతైన వారి కోసం డైవర్లు, గజ ఈతగాళ్లు విస్తృతంగా శోధన చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *