నకిలీ క్రైమ్ కానిస్టేబుల్ అరెస్ట్ (ఎర్పుల నాగరాజు )

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

—నిందితుడు నిర్మానుష్య ప్రేమికుల జంటలను టార్గెట్ చేస్తూ దోపిడీకి పాల్పడిన  చరిత్ర ఉన్నది

.రవి ఎస్సై గండ్రాతి సతీష్

తొలి సమయం మహబూబాబాద్ మర్చి 23:

పోలీసులమని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని కురవి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన వెలుగు చూసింది

కురవి ఎస్సై సతీష్ గండ్రాతి వివరాల ప్రకారం…ఫిర్యాదు దారుడు పులిచింతల శ్రీనివాస్ నుంచి రూ.22,300 దోచుకున్న ఎర్పుల నాగరాజును అరెస్ట్ చేసి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు,
మహాశివరాత్రి జాతర సందర్భంగా బాధితుడిని బెదిరించి నగదు, ఫోన్‌పే ద్వారా డబ్బులు తీసుకున్నట్టు గుర్తించారు….
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు..
ఇప్పటికే పలువురిని బ్లాక్‌మెయిల్ చేసిన చరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిర్మానుష ప్రదేశాల్లో ప్రేమికులను టార్గెట్ చేసి ‘పోలీసుని’ అంటూ డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడించారు….
ప్రభుత్వ అధికారుల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కురవి ఎస్సై గండ్రాతి సతీష్ హెచ్చరించారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *