ఉగాది కవి సమ్మేళనంలో సభానిర్వహణ బాధ్యత కోసం రాజకీయాలు…
—- ప్రైవేటు సాహిత్య సంస్థల యాజమాన్యానికి ఇవ్వడం వలన
నచ్చని వారిపై ద్వేషం చిమ్ముతూ వ్యంగ్యంగా మాట్లాడుతు కించపరుస్తున్నారు
తొలి సమయం, మహబూబాబాద్ మర్చి22:
ఉగాది కవి సమ్మేళన నిర్వాహకులుగా ఉమ్మడి వ్యక్తులను నియమించాలని జిల్లా కేంద్రంలో సాహితీవేత్తల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. సాహిత్య సంస్థలు నడిపే వ్యక్తులకు ఉగాది సందర్బంగా నిర్వహించే కవి సమ్మేళనంలో ఆశ్రిత పక్షపాతం వహిస్తూ, సభా గౌరవానికి అవమానం తెస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. సాహిత్య సంస్థలు నిర్వహించే వారికి నిర్వహణ బాధ్యతలు వప్పజెప్పడం వలన. చాలామంది కవులు కళాకారులు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.. సాహిత్య సంస్థలు నిర్వహించేవారు ఉగాదికి ముందు వారి వ్యక్తిగత కవి సమ్మేళనాన్ని జరుపుతారు, వారి ప్రైవేటు వ్యక్తిగత సాహిత్య సభలకు సహకరించి,హుజూర్ అన్నోళ్లను ముందు వరుసలో వేదిక పైకి పిలుస్తున్నారు,వారికి ఇష్టంలేని, సహకారం చెయ్యని, వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని, జిల్లా కేంద్రంలోని కవులు మాట్లాడు కుంటున్నారు. ఉగాది వేడుక సందర్బంగా ప్రైవేట్ సాహిత్య వేదిక యాజమాన్యలకు ఇవ్వడం వలన, నచ్చని వారిని వేదికపై ద్వేషభావనతో కించపరుస్తూ, జోక్స్ పేలుస్తున్నారని విమర్శలు వినఆడుతున్నాయి, తాం అంటే, తందానా అనే టోల్లంతా వేదిక పై జమ అవుతున్నారని టాక్ నడుస్తోంది, శ్రీరామ మందిరం లో ప్రతి ప్రతి ఏటా జరిగే కవి సమ్మేళనంలో సభా నిర్వహణ బాధ్యతను సాహిత్య సభలకు సంబంధించిన వ్యక్తులకు కాకుండా ఉమ్మడి వ్యక్తికి వప్ప చెప్పాలని కవులు కళాకారులు కోరుకుంటున్నారు.