వరంగల్ లో భారీ అగ్ని ప్రమాద దుర్ఘటన..
మంటల్లో ఫర్నిచర్ దహనం
తొలి సమయం, మహబూబాబాద్ ప్రతినిధి7:
వరంగల్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే జే పీ ఎన్ రోడ్ లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది స్థానిక దత్తాత్రేయ ఫర్నిచర్ షాప్ లో అకస్మాత్తుగా మంటలు చెల చెలరేగడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది దత్తాత్రేయ ఫర్నిచర్ షోరూమ్ షాప్ లో ఫర్నిచర్ చెక్క సామాగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి, మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు లో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి ప్రమాదానికి కారణాలు తెలవ నున్నాయి..