హన్మకొండ జిల్లా శనిగరం లో ఘోర రోడ్డు ప్రమాదం

హన్మకొండ జిల్లా శనిగరం లో ఘోర రోడ్డు ప్రమాదం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
  • ఇద్దరు యువకులు మృతి

హనుమకొండ జిల్లా:కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన నవీన్ కుమార్, నాగరాజు అనే యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా లక్ష్మీపూర్ గ్రామం సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనతో శనిగరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలకు గ్రామస్తులు సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *