పేద ఇంటి బిడ్డను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..
10 వ వార్డు అభ్యర్థి ఉప్పునూతల సంధ్యా రమేష్.
తొలి సమయం కేసముద్రం ఫిబ్రవరి 06:
మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డును అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని 10 వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పునూతల సంధ్యా రమేష్ పేర్కొన్నారు. సాధారణ మధ్యతరగతి మరియు బలహీన వర్గానికి చెందిన ఒక సామాన్య దినసరి కూలీ అయిన నాకు బీజేపీ ఈ అవకాశాన్ని కల్పించింది అని ఇది కేవలం బీజేపీలోనే సాధ్యమని ఆయన అన్నారు. ఎన్నికల్లో భాగంగా ప్రతిరోజు వార్డులో ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండానే ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్, మరియు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వార్డు ప్రజలు ఆలోచించి ఈనెల 11న జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఉప్పునూతల సంధ్యా రమేష్ ఓటర్లను కోరారు.
మన మోదీ దృఢ సంకల్పంతో తెలంగాణ పట్టణాల రూపురేఖలు మారుతున్నాయి అని. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న భారీ నిధులతో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి అని.మన నగరాల అభివృద్ధి ప్రయాణం ఇలాగే కొనసాగాలంటే… రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి, బిజెపిని గెలిపించండని,కేసముద్రం మున్సిపాలిటీ అభివృద్ధికోసం బిజెపికి పట్టం కట్టండి, మన కేసముద్రం నూతన మున్సిపాలిటీని అభివృద్ధి పథంలోకి నడిపించండని విజ్ఞప్తి చేసారు.అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి బిజెపి పార్టీతోనే సాధ్యమని ప్రచారం లో పాల్గొన్నా బిజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ మధన్ నాయక్ స్పష్టం చేశారు
ప్రచార కార్యక్రమలో మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, ఎస్టి మోర్చా జిల్లా నాయకులు బాదావత్ సురేష్, జాటోత్ సురేష్, వరుణ్, భూక్య బాలు, తదితరులు పాల్గొన్నారు.