మధ్యప్రదేశ్ లో 3 రోజుల పాటు జరిగిన 33వ ఆదివాసి సాంస్కృతిక ఐక్యత మహా సమ్మేళనంలో పాల్గొన్న తెలంగాణ ఆదివాసి  జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ..

మధ్యప్రదేశ్ లో 3 రోజుల పాటు జరిగిన 33వ ఆదివాసి సాంస్కృతిక ఐక్యత మహా సమ్మేళనంలో పాల్గొన్న తెలంగాణ ఆదివాసి  జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆదివాసీ తెగల సాంస్కృతిక ఉద్యమమే, జాతి ఐక్యతకు పునాది..

––మైనింగ్ పేరున మన ఏజెన్సీ భూములు నాశనం అవుతున్నాయి.

— మన అడవుల్లో సహజ వనరుల దోపిడీ జరుగుతోంది..

— రాజ్యాంగం ఇచ్చిన ఐదవ షెడ్యూల్లోని హక్కులను, చట్టాలను కాలరాస్తున్నారు

తెగల సాంస్కృతిక పోరాటమే జాతి అస్తిత్వాన్ని కాపాడుతుంది

తెలంగాణ ఆదివాసి 9 తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ

తొలి సమయం ప్రధాన ప్రతినిధి మహబూబాబాద్ జనవరి 15:

మన రేపటి తరాల భవిష్యత్తు అంధకార బంధురంగా మారబోతుందని, మన అడవుల్లో సహజ వనరుల దోపిడీ జరుగుతుందని, మైనింగ్ పేరుతో మన భూములు నాశనం అవుతున్నాయని, రాజ్యాంగం ఇచ్చిన ఐదవ షెడ్యూల్ హక్కులను కాలరాస్తున్నారని, భారత దేశంలోని ఐదవ ,ఆరవ షెడ్యూల్లోని మూల ఆదివాసీ తెగల మనుగడ మరియు అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే సాంస్కృతిక పోరాటమే ఆదివాసి జాతి ఐక్యతకు పునాది అన్నారు..
ఆదివాసి ఏక్తా పరిషత్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని బురాన్పురా జిల్లా చైన్ పురా గ్రామంలో నిర్వహించిన, 33వ ఆదివాసి సాంస్కృతిక ఐక్యత మహాసమ్మేళనంలో తెలంగాణ 9 తెగల ఆదివాసి జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ మూల ఆదివాసి సమాజానికి సాంస్కృతిక ఉద్యమ అవసరాన్ని తెలియజేస్తూ ఒక ప్రెస్ నోట్ ద్వారా మాట్లాడారు.. ఆదివాసి జాతి ఐక్యత కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం సాంస్కృతిక పోరాటాన్ని ఆయుధంగా చేసుకొని ముందుకు సాగుతున్న ఉద్యమం నేడు దేశవ్యాప్తంగా ఆదివాసి సమాజానికి దిశా నిర్దేశం చేస్తుంది అన్నారు.. మధ్యప్రదేశ్ ఆదివాసీ మహా సమ్మేళనంలో పాల్గొని స్ఫూర్తి పొందిన అనేక విషయాలు తెలియజేశారు.. ముఖ్యంగా ఆదివాసి సంఘాల నాయకులకు, ఉద్యమకారులకు ఆదివాసి యువత సోదర సోదరీమణులకు వందనాలు తెలియజేశారు.. దేశంలోని అన్ని ఆదివాసి తెగలు ఒకే వేదికపై ఐక్యంగా రావాలి అన్నారు , రాజ్యాంగ హక్కుల సాధనకు రిజర్వేషన్ ఫలాల పరిరక్షణకు మరియు ఐదో, ఆరో షెడ్యూల్ చట్టాలు అమలుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసి హక్కులకు భంగం కలిగిస్తున్న వలస వచ్చిన గోర్ బంజారా లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు మామూలు వేమీ కావు అన్నారు, అడవుల్లో సహజ వనరుల దోపిడి జరుగుతుందన్నారు. మైనింగ్ పేరుతో ఆదివాసీల భూములు నాశనం అవుతున్నాయి అన్నారు .రాజ్యాంగం ఇచ్చిన ఐదవ షెడ్యూల్లోని భూముల పై హక్కులు కాలరాస్తున్నారన్నారు. ఈ అన్యాయాలను ఎదుర్కోవాలంటే జాతి అంతా ఐక్యమై పోరాటం చేయాలన్నారు .అందుకు సాంస్కృతిక పోరాటమే ఆదివాసి జాతి ఐక్యతకు నాంది పలుకుతోందన్నారు. మన జాతరలు మన పండుగలు మన భాషలు మన సంప్రదాయాలు ఇవే మన ఆయుధాలు అని గుర్తు చేశారు.. ముఖ్యంగా యువతకు బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ ఉద్యమం నీకోసం నీ రేపటి కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్నారు, యువత ముందుకు రాకపోతే ఉద్యమానికి శక్తి ఉండదని, యువత భాగస్వామ్యం లేకుండా ఐక్యత సాధ్యం కాదన్నారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు సాంస్కృతిక వేదికల నుంచి ఉద్యమ వేదికల వరకు ప్రతి ఆదివాసి యువకుడు ఒక ఉద్యమ కార్యకర్తగా మారాలన్నారు, నాయకుల అండగా నిలబడాలని అన్నారు సాంస్కృతిక ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా మార్చుదాం అన్నారు. మనం తీసుకునే నిర్ణయమే మన పిల్లల హక్కులకు పునాది అవుతుందని రాజ్యాంగ పరిరక్షణ కోసం ఒకే వేదిక పైకి రావాలని సమిష్టి నిర్ణయం తీసుకోవాలని , ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *