హైదరాబాద్‌లో మరో యువతి హత్య

హైదరాబాద్‌లో మరో యువతి హత్య

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బోరబండ సమీపంలో యువతి హత్య – పరిచయమే ప్రాణాంతకమైంది*

తొలి సమయం డెస్క్ హైదరాబాద్ జనవరి 12:

హైదరాబాద్ నగరంలో మరోసారి దారుణ ఘటన చోటుచేసుకుంది. బోరబండ సమీపంలో ఒక యువతిని యువకుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు.

గతంలో బంజారాహిల్స్ సమీపంలోని ఒక పబ్‌లో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవల ఆ యువతి ఊర్వశి బార్‌కు షిఫ్ట్ కావడంతో యువకుడిని పట్టించుకోవడం తగ్గిందని భావించిన అతడు తీవ్ర కోపానికి లోనయ్యాడు.

మాట్లాడదామని చెప్పి యువతిని పిలిచిన యువకుడు, అక్కడే ఆమెపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *