చిరుమళ్ళ( సిరిమల్లె )లో తలపతులు,ఆర్తి బిడ్డల అత్యంత ఆదివాసీ ధార్మిక పద్దతిలో ఘనంగా సమావేశం..
తొలి సమయం భద్రాద్రి కొత్తగూడెం జనవరి 11:
భద్రాద్రి జిల్లా
కరకగూడెం మండలం లోని *చిరుమళ్ళ (సిరిమల్లె ) గ్రామంలోని సమ్మక్క సారలమ్మ తల్లుల గుడి ప్రాంగణంలో*
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన
అన్ని తలపతులు, పెద్దలు, ఇలువేల్పుల ప్రతినిధులు
ఒకే వేదికపై సమవేశం కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
ఆదివాసి ఐక్యతకు చారిత్రక ఘట్టంగానిలిచింది.
సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణ కష్టాలను కూడా లెక్కచేయకుండా
*సమ్మక్క–సారలమ్మ తల్లుల పిలుపుకు స్పందించి
చేరుకున్న ప్రతి ఒక్కరికీ
జాతర కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది
ఈ కార్యక్రమంలో
మేడారంలో జరగనున్న వేల్పుల సమ్మేళనంలో
తలపతులకు డోలి ఆర్తి,
బిడ్డలకు రవాణా భత్యం,
ఇతర సౌకర్యాలపై పూర్తిస్థాయిలో సుదీర్ఘంగా చర్చించారు
చర్చించిన అంశాలను
మంత్రి సీతక్క దృష్టికి నివేదించుట జరుగునని జాతర కమిటీ తీర్మానించింది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఆదివాసి
తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా,
తమ *సాంప్రదాయ, సాంస్కృతిక విలువలను కాపాడుకుంటూ,*
ఐక్యతతో ముందుకు సాగుతూ
మేడారం జాతరను విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని నిర్ణయంచారు.
ఆదివాసి *9 తెగల చైర్మన్ శ్రీ చుంచు రామకృష్ణ ఆధ్వర్యంలో*
సమీక్ష సమావేశం విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా
చిరుమళ్ళ (సిరిమల్లె) సమ్మక్క తల్లి ప్రాంగణం జన సమూహంతో కళకళలాడుతూ,ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.
సమాజం మొత్తం సమిష్టి నిర్ణయంతో, ఐక్యంగా ముందుకు సాగుతూ *మేడారం జాతర సందర్భంగా నిర్వహించే 150 కోయత్తుర్ ఇంటి వేల్పుల సమ్మేళనానికి గద్దెల ప్రారంభోత్సవానికి 20 వేల్పులు 50 ఆర్తి బిడ్డల డోలి సమ్మక్క పేరంటాలకు నిధులు కేటాయించాలని చిరుమళ్ళ లో తీర్మానించారు.ఈ సమావేశాన్ని మరియు రాబోయే కార్యక్రమాలను విజయవంతం చేయడం జరుగుతుందనిఈ సందర్భంగా ప్రకటించారు.