మానుకోట ప్రభుత్వ హై స్కూల్ (బాయ్స్ ) లో నేటి నుండి 18 వ తారీకు వరకు ఉచిత ఆర్చరీ శిక్షణ…
నా సర్వతోముఖాభివృద్ధికి పునాదిగా మానుకోట ప్రభత్వ హైస్కూల్ మైలు రాయి ,అందులో భాగంగా సేవా దృక్పదంతో, మా నాన్న సాదుల ముత్తయ్య చారిటబుల్ మెమోరియల్ ట్రస్ట్ ఉచిత అర్చరీ శిక్షణ కు స్వీకారం చుట్టాను..
— సంక్రాంతి సెలవుల సందర్బంగా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
సాదుల సారంగ పాణి
తొలి సమయం మహబూబాబాద్ జనవరి 10
జనవరి 11 నుండి ఈనెల 18వ తారీకు వరకు జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ఉచిత ఆర్చరీ శిక్షణా శిభిరాన్ని సాదుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్నట్లు సాదుల సారంగపాణి తెలియ జేశారు, ఈ శిక్షణ శిభిరం జాతీయ అర్చరీ డెవలప్ మెంట్ కమిటీ మెంబర్ పుట్ట శంకరయ్య పర్యవేక్షణలో కొనసాగుతుందని అన్నారు.. ఈ సందర్భంగా సాదుల సారంగపాణి మాట్లాడుతూ.. తీరిక లేని ఆధునిక జీవన విధానం,వత్తిడి తో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.వాటి పరిష్కార దిశగా క్రీడలు, వ్యాయామ, ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ఆర్చరీ క్రీడా విభాగాన్ని వేదికగా మా నాన్న సాధుల ముత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాను, అన్నారు వారం రోజుల పాటుగా చేస్తున్న ఆర్చరీ ఉచిత శిక్షణ శిబిరాన్ని మానుకోట విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో మానుకోట స్పోర్ట్స్ విభాగం, నేషనల్ బాస్కెట్ బాల్ క్రీడాకారులు ముల్లంగి ప్రతాప్, సాదుల ప్రకాష్, సీనియర్ అడ్వకేట్ తుంపిళ్ల శ్రీనివాస్, హై స్కూల్ ఇన్చార్జ్ హెడ్మాస్టర్ కేదాసు వాసుదేవ్, అడ్వకేట్ కొంపెల్లి వెంకటయ్య, నూకల బాలకృష్ణ రెడ్డి,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు