*మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం స్థానం లో బీజేపీ మోడీ ప్రభుత్వం వీబీజీ రాంజీ పేరుతో తెస్తున్న పథకాన్ని రద్దు చేసే వరకు పోరాడుదాం!*
*మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంకండి!!*సిపిఎం*
తొలి సమయం, ఇల్లందు;
జనవరి, 08.
సిపిఎం పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం లో పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యవసాయ కూలీలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పోరేట్ శక్తుల కు ఊడిగం చేస్తున్నారని అందులో భాగంగానే స్వాతంత్రానికి ముందు తర్వాత కార్మికులు సాధించుకున్న 29 చట్టాలనురద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చారని,రైతు వ్యతిరేక విత్తన చట్టం తెచ్చారని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వీబీజీ రాంజీ నీ అమలు లోకి తెచ్చారని ఇదంతా కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేసే చర్య అని అన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు ఏ జే రమేష్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా,మతోన్మాదానికి వ్యతిరేకంగా నికరంగా సిపిఎం పార్టీ రాజీ లేని పోరాటం కూడా చేస్తున్నదని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. సంధ్య అధ్యక్షతన జరిగిన సభలో అబ్దుల్ నబి సీపీఎం మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ కుమార్, మన్యం మోహన్ రావు, ఖాదర్, సర్వన్ కుమార్, మాదారపు వెంకటేశ్వర్లు,మరియా,అబ్బాస్,నాగరాజు, సత్యనారాయణ కోరి, సుజాత,సంతోష,వెంకన్న గెలిచిన ఇందిరా నగర్,సుభాష్ నగర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సోమ సుజాత,కొమరం సరోజ,విజయకుమార్, ఆర్ బి జే రాజు తదితరులు పాల్గొన్నారు.