మానుకోట లో బాల బాలికల కోసం సాదుల ముత్తయ్య చారిటబుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత విలువిద్య శిక్షణ శిబిరం….

మానుకోట లో బాల బాలికల కోసం సాదుల ముత్తయ్య చారిటబుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత విలువిద్య శిక్షణ శిబిరం….

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జనవరి 11 నుంచి 18 వరకు | ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం..

శ్రీ సాదుల సారంగపాణి, పుట్ట శంకరయ్య

పిల్లల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం మరియు క్రీడా నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో, సాధుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి 11 నుండి 18 వరకు మహబూబాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఒక ప్రత్యేక విలువిద్య (ఆర్చరీ) శిక్షణ శిబిరం నిర్వహించబడుతోందని సాదుల సారంగపాణి, మరియు ఆర్చరి డెవలప్ మెంట్ జాతీయ కమిటీ మెంబర్ పుట్ట శంకరయ్య ఓ ప్రకటన లో తెలిపారు

ఈ శిబిరాన్ని శ్రీ సారంగ పాణి సాదుల మరియు శ్రీ పుట్ట శంకరయ్య సంయుక్తంగా నిర్వహిస్తున్నారు అన్నారు. ఈ శిక్షణ 18 సంవత్సరాల లోపు పిల్లల కోసం ఏర్పాటు చేయబడింది అన్నారు. శిక్షణ సమయాలు:
• ఉదయం: 6:00 నుండి 9:00 గంటల వరకు
• సాయంత్రం: 4:00 నుండి 6:00 గంటల వరకు

విలువిద్య క్రీడ పిల్లల్లో మానసిక స్థిరత్వం, సహనం, ఏకాగ్రత, శారీరక సమన్వయం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొబైల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచి, ఆరోగ్యకరమైన జీవనశైలికి పిల్లలను అలవాటు చేస్తుంది. అంతేకాకుండా, ఈ క్రీడ ద్వారా క్రీడా కోటా, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది.

తల్లిదండ్రులు మరియు పాఠశాలల యాజమాన్యాలు ఈ అవకాశాన్ని గుర్తించి, తమ పిల్లలను ఈ శిబిరంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మహబూబాబాద్‌లోనే ఇలాంటి శిక్షణ అందుబాటులో ఉండటం అరుదైన అవకాశం.
“క్రీడల ద్వారా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం – ఏకాగ్రత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిద్దాం.”
Contact: 093946 43139

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *