ఆలయ నిర్మాణం అభినందనీయం
తహశీల్దార్ రమేష్ బాబు, ఎస్సై మాలోత్ సురేష్
తొలిసమయం, కొత్తగూడ : మండల పరిధిలోని రాంపూర్ నుంచి సరసనపల్లి వెళ్లే ఆర్ అండ్ బి రహదారిపై నూతన కల్వర్టు నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు. ఈ రహదారిపై ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టడం జరిగింది. ఈ కల్వర్టు నిర్మాణ పనులకు జంగవానిగూడెం గ్రామ సర్పంచ్ గొంది సోనీ రాజు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, రోడ్ల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందించేందుకు ఈ కల్వర్టు నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అలెం మహేందర్, దారం యకబాబు, ఈసం స్వామి, మాజీ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ దారం భూపాల్, బంగారి యాకయ్యతో పాటు పలువురు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.