తొలి సమయం, ఇల్లందు : ఇల్లందు మండలం, ఇందిరానగర్ గ్రామపంచాయతీలో క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ పాయం లలిత ఇందిరానగర్ గ్రామంలో విద్యుత్ సమస్యలపై అధికారులకు తెలియపరచడం జరిగింది. నూతనంగా కొత్త స్తంభాలు, డ్యామేజ్ అయిన స్తంభాలను తీసేసి మరల కొత్త స్తంభాలు మార్చవలసిందిగా కోరారు. కొత్త ట్రాన్స్ఫర్ లు శాంక్షన్ అయినందున వాటిని అమర్చడం కొరకు స్థలం చూడడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు డి ఈ, ఏ ఈ, టెక్నీషియన్, లైన్ మెన్స్, ఉప సర్పంచ్ బి ఆదిత్య, సెక్రెటరీ వాస్ కుమార్, వార్డు సభ్యులు బి. సుదర్శన్, శ్రీకాంత్ పాసి, రమాదేవి, చుక్కమ్మ, బి.రాకేష్, సుజాత,ప్రజలు వంగపండ్ల నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భార్గవ్, రాజేశ్వరరావు, అశోక్, రాంబాబు, సంకు, సాంబ, పిల్లి ఝాన్సీ, తదితరులు పాల్గొనడం జరిగింది.
ఇందిరానగర్ లో విద్యుత్ అధికారుల ప్రజాబాట
07
Jan