పెబ్బేర్ MPDO కు గ్రామాల్లోని ప్రధాన సమస్యలపై వినతిపత్రం

పెబ్బేర్ MPDO కు గ్రామాల్లోని ప్రధాన సమస్యలపై వినతిపత్రం

తొలి సమయం పెబ్బేరు జనవరి 6

జనసేన పార్టీ వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు.

పెబ్బేర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పలు సమస్యలు పాలకవర్గం నియామకం లేక కొన్నేళ్లుగా అలాగే వుండిపోయాయని, త్వరితగతిన గ్రామాల్లో అన్ని సమస్యలు తీర్చాలని జనసేన పార్టీ వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు మంగళవారం MPDO వెంకటేశ్ గారికితెలియజేశారు. గ్రామాల్లో ప్రధానంగా పారిశుధ్యం పడకేసిందనీ వీధి రోడ్లు శుభ్రంగా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని, అలాగే వివిధ గ్రామాల్లో విధి కుక్కల బెడద చాలా ఎక్కువగా వుండి ప్రజలపైదాడికియత్నిస్తున్నాయనిఇప్పటికేపాడిపశువులపై, చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయని వెంటనే గ్రామాల్లో వీధి కుక్కల పట్టివేత చేపట్టాలని అదేవిధంగా వివిధ గ్రామాలకి వెళ్ళే రోడ్డు మార్గాలు ఇరువైపుల చెట్ల కొమ్మలు, ముళ్ళకంప చెట్లు పెరిగి వాహనాలకు అడ్డంకి మారాయి కావున వాటిని తొలగించి ప్రజల సమస్య తీర్చాలని MPDO కు వినతిపత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *