రాష్ట్ర స్థాయి వేదికపై డఫొడిల్స్ పాఠశాల విద్యార్థినిలు
ఇన్స్పైర్ మునక్ అవార్డ్స్ & రాష్ట్ర స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో
ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకాన్నునారు
ఇన్స్పైర్ వేదికలు భవిష్యత్ శాస్త్రవేత్తలకు దారి చూపుతాయి – డఫొడిల్స్ పాఠశాల చెర్మన్ చింతల నరేందర్
తొలిసామయం నర్సంపేట
రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల శాస్త్రీయ ప్రతిభకు వేదికగా ఇన్స్పైర్ మునక్ అవార్డ్స్ మరియు రాష్ట్ర స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాలు జనవరి 7 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ, ఇన్స్పైర్ కార్యక్రమం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలోని విద్యానికేతన్ హై స్కూల్, డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం ప్రాంగణంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ కార్యక్రమాల్లో డఫొడిల్స్ పాఠశాల విద్యార్థినీలు పాల్గొననుండటం విశేషం. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందించడంతో పాటు, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వడమే ఈ ప్రదర్శన ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రాష్ట్ర స్థాయి వేదికపై డాఫొడిల్స్ విద్యార్థులు తమ సృజనాత్మకతతో రూపొందించిన ఆధునిక విజ్ఞాన నమూనాలు, వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. విజ్ఞానశాస్త్రాన్ని పుస్తకాలకే పరిమితం చేయకుండా, ప్రయోగాత్మకంగా నేర్చుకునే విధానానికి పాఠశాల యాజమాన్యం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో కార్యక్రమానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
డఫొడిల్స్ పాఠశాల చెర్మన్ చింతల నరేందర్ ప్రోత్సాహంతో, సైన్స్ టీచర్ సాయి కిరణ్ పర్యవేక్షణలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా చెర్మన్ చింతల నరేందర్ మాట్లాడుతూ…. విద్యార్థులు ప్రశ్నించాలి, ఆలోచించాలి, ప్రయోగాలు చేయాలి. అప్పుడే నిజమైన విజ్ఞానం పెంపొందుతుంది అని ఇన్స్పైర్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు భవిష్యత్ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే వేదికలుగా నిలుస్తాయని డఫొడిల్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.