పేదల రాజ్యం కోసం పోరాడేది కమ్యూనిస్టులే

పేదల రాజ్యం కోసం పోరాడేది కమ్యూనిస్టులే

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం, మహబూబాబాద్ జనవరి 4:

భారతదేశంలోని పేద వర్గాల సకల సమస్యలను తీర్చే పేదల రాజ్యం కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని *సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాయం చిన్న చంద్రన్న* అన్నారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి నేటికీ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా *జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సెంటర్ బట్టు అంజయ్య నగర్* లలో సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ జండాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రన్న మాట్లాడుతూ సంస్థానాధీశులు, వలస పాలకులైన బ్రిటిష్ వారి దోపిడీకి భూస్వామ్య, పెట్టుబడి దారి దోపిడీలపై పేదలకు అండగా ఎర్ర జెండా పార్టీ నిలిచిందని అన్నారు. వేలాది మంది రక్తతర్పణలు చేసి ప్రాణాలు ఇచ్చారాని,లక్షలాదిమంది తీవ్ర నిర్బంధాలను ఎదుర్కొన్నారని అన్నారు.పేదలకు భూమి ఉపాధి ఆత్మగౌరవాన్ని అందించిన కమ్యూనిస్టు పార్టీ వారి విముక్తికి కూడా పాటుపడుతుందని అన్నారు. తరతరాలుగా పేద సామాన్య మధ్యతరగతి ప్రజానీకం పై భూస్వామ్య విధానం భావజాలం ఆధిపత్యం వేయిస్తే మట్టి మనుషులకు వర్గ చైతన్యం అందించి తిరుగుబాటు చేయించిందని అన్నారు. నేడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా ద్రోహకరమైన విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. *సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి* మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ఇలా అమలులో గాలికి వదిలేసిందని అన్నారు. యూరియాను అందించలేని అసమర్థ ప్రభుత్వంగా మిగిలిందని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఐక్య ఉద్యమాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. *సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు ఉమాగాని సత్యం డివిజన్ నాయకులు బూర్గుల మోష తో పాటుగా సట్ల యాకయ్య ఉప్పలయ్య కొమరయ్యశ్రీను రాంచంద్రం ఐలయ్య లక్ష్మి వెంకటమ్మ* తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *