పీఆర్టీయు టీఎస్ శ్రీరంగాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ

పీఆర్టీయు టీఎస్ శ్రీరంగాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం శ్రీరంగాపూర్ ఆగస్టు 5

 

పీఆర్టీయు టీఎస్ శ్రీరంగాపూర్ మండల శాఖ అధ్యక్షులు శ్రీ వసంతపురం రాజు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ నాయిని విష్ణువర్ధన్ నాయుడు. ఆధ్వర్యంలో పీఆర్టీయు టీఎస్ దైనందిన కాలమానినిని శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ముఖ్య అతిథులు, అధికారులు మరియు యూనియన్ నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమమే పీఆర్టీయు టీఎస్ ఎజెండ.వసంతపురం రాజు, మండల అధ్యక్షులు.
సంఘం ఏర్పడి 50 ఏళ్లకు పైన అవుతున్నా సంఘం ఏర్పడ్డ నాటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాడుతుందని పేర్కొన్నారు. గత పీఆర్సీ కమిటీ కేవలం 7.5 శాతం ప్రతిపాదించగా నాటి రాష్ట్ర అధ్యక్షులు నేటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ పింగళి శ్రీపాల్ రెడ్డి. చలువతో 30 శాతం పీఆర్సీ సాధించిన సంఘం పీఆర్టీయు టీఎస్ అని ఉద్ఘాటించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు కొన్ని చర్యలు చేపట్టినా, ఇంకా చాలా సమస్యలు అనగా సీపీఎస్ విధానం రద్దు , హెల్త్ కార్డ్స్ అమలు, పెండింగ్ డీ.ఏ.ల మంజూరు, పెండింగ్ బిల్లుల చెల్లింపు లాంటి సమస్యలు రోజురోజుకు పేరుకు పోతున్నాయని వాటినన్నిటినీ త్వరగా క్లియర్ చేయాలని అదేవిధంగా తక్షణమే మెరుగైన ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకవైపు ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతూ, మరోవైపు ప్రభుత్వ పాఠశాలకు విచ్చేస్తున్న విద్యార్థులకు మెరుగైన మరియు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. అందుకే అత్యధిక రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పీఆర్టీయు టీఎస్ ప్రతినిధులు సాధించగలిగారని తెలిపారు.
కార్యక్రమంలో శ్రీరంగాపూర్ మండల ఎంపీడీవో శ్రీ రవి నారాయణ. మండల విద్యాధికారి శ్రీ హనుమంతు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జ్యోతి. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటేష్. శ్రీరంగాపూర్ సర్పంచ్ శ్రీ ముంత మద్దిలేటి. మాజీ ఎంపీటీసీ శ్రీ ఎల్లస్వామి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ రెడ్డిచర్ల శ్రీహరి. కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ కుమ్మరి గోవింద్ గారు, శ్రీ రామచంద్రయ్య., శ్రీ విష్ణు గారు, శ్రీ రామరాజు. శ్రీ బహుజన రమేష్. పీఆర్టీయు టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ రామచంద్రయ్య. శ్రీ శివ శంకర్ యాదవ్ .రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ నాగేశ్వర్ రెడ్డి. జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీ జయంత్ రెడ్డి. పెబ్బేరు మండల అధ్యక్షులు శ్రీ దాసరి చిన్నరాములు. శ్రీరంగాపూర్ మండల అసోసియేట్ అధ్యక్షులు శ్రీ కృష్ణమూర్తి.మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు శ్రీమతి పృథ్విమాత. ఉపాధ్యక్షులు శ్రీ నరేష్.కార్యదర్శి శ్రీ దామోదర్ బాబు. మరియు ప్రాథమిక సభ్యులు పెద్దమొత్తంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *