మానుకోటను సుభిక్షంగా చూడాలి – వెన్నం శ్రీకాంత్ రెడ్డి
*గూడూరు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న వెన్నం శ్రీకాంత్ రెడ్డి*
జిల్లాలోని గూడూరు మండలంలోని వట్టివాగు సమీపంలో ఉన్న ప్రసిద్ధ సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని టీపీసీసీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా *వెన్నం శ్రీకాంత్ రెడ్డికి* ఆలయ *పూజారులు దారం సిద్దు,తాటి సుధాకర్,వాసం రమేష్,కోర్స గోవర్ధన్ ,దారం నరేశ్,పోతయ్య, బుచ్చమ్మ,భద్రమ్మ* లు
ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, మానుకోట ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని దేవతలను ప్రార్థించారు. అనంతరం మాట్లాడుతూ, సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.*రెడ్యాల గ్రామ అభివృద్ధి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.*
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.