తొలి సమయం, వనపర్తి : వెనుజుల అధ్యక్షుడు మధురో దంపతులను అరెస్టు చేసి అమెరికాలో నిర్బంధించటంపై సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి అంబేద్కర్ చౌక్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, మధుర దంపతులను వెంటనే విడుదల చేయాలని, ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాలని సిపిఐ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కమిటీ అధ్యక్షుడు రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్ మాట్లాడుతూ వెనిజులా దేశ అధ్యక్షుడు మధుర దంపతులను అరెస్టు చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రపంచ దేశాలు డోనాల్డ్ ట్రంప్ చర్యను ఖండించాలని కోరారు. వెనిజులా చమురు నిక్షేపాలను కొల్లగొట్టేందుకే వారిని అరెస్టు చేయటం నీచం హేయమన్నారు, ట్రంపు నిరంకుశ పోకడలను ఐక్యరాజ్యసమితి అదుపు చేయాలన్నారు. మధుర దంపతులను స్వచ్ఛందంగా విడుదల చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికా సామ్రాజ్యవాదానికి ఎన్ని దేశాల ప్రజలు బలికావాలో అర్థం కావటం లేదన్నారు. అమెరికా దేశ ప్రజల నుంచి చిత్కారాలు ఎదుర్కొంటున్న ట్రంప్ దానిని కప్పిపెట్టేందుకు ఇలాంటి మూర్ఖపు పోకడలు ఎంచుకున్నారని ప్రజల నుంచి తగిన గుణపాఠం తప్పదు అన్నారు. ఇప్పుడు వెనిజులా మరో మూడు దేశాలను ఆక్రమించేందుకు ట్రంప్ కుట్ర చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయన్నారు. వెనిజులా తీరుకు గుణపాఠం చెబితేనే అతని దూకుడు తగ్గుతుందన్నారు. ప్రపంచ శాంతి బహుమతి కావాలని కలలు కంటున్న ట్రంప్, ప్రజాస్వామికంగా ఇతర దేశాలను ఆక్రమించి ప్రపంచ యుద్ధాలకు నాంది పలుకుతున్నాడని విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు మాజీ సర్పంచ్ కళావతమ్మ, శ్రీరామ్, చిన్న కుర్మయ్య, జయమ్మ, రమణ, కృష్ణ, జ్యోతి ,రూప, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మ దహనం
05
Jan