తొలి సమయం, ఇల్లందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ తరపున గెలుపొందిన సర్పంచుల ఆత్మీయ అభినందన
సన్మాన సభకు ఈనెల 7న కొత్తగూడెం జిల్లా కేంద్రానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ టేకులపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంఛార్జ్ హరిప్రియ మాట్లాడుతు ఈనెల 7న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికి, గొప్ప పొరటపటిమతో డి అంటే డి అని గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచులను స్వయంగా కలిసి అభినందించి వారికి భరోసా కల్పించాలని ఉద్దేశంతో వస్తున్నారని హరిప్రియ తెలిపారు. పార్టీ బాధ్యులు పిలుపు మేరకు ఈ నెల 7న 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగే సన్మాన కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచులు, ఉప సర్పంచులు ప్రతి ఒక్కరు ఆత్మీయ అభినందన సభకు తప్పక రావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర వరప్రసాద్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లక్కినేని సురేందర్ ,భూక్యా దళ్ సింగ్, ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.