తొలిసమయం, కొత్తగూడ : నగరంలోని మూడో డివిజన్ పరిధిలో గల హజరత్ నూరుద్దీన్ దర్గా ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ అయూబ్ హాజరై, దర్గా పీఠాధిపతి సూచన మేరకు గంధము, చాదర్ మరియు పూలమాలలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మూడో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్ను శివ అనిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్గా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్పొరేటర్ ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు దర్గా ప్రత్యేక పూజలు నిర్వహించడం అందరికీ ఆదర్శంగా నిలిచిందని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ, హజరత్ నూరుద్దీన్ దర్గా ఆశీస్సులు వరంగల్ జిల్లా మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంపై ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్లో దర్గా ఉత్సవాలను ప్రభుత్వం నుండే అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కు ముస్లిం సమాజం తరఫున, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మూడో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా హజరత్ నూరుద్దీన్ దర్గా ఉత్సవాలు
04
Jan