ముత్యాలమ్మ గూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల బాలిక ఆత్మహత్య యత్నం..
గుట్టు చప్పుడు కాకుండా, తల్లి దండ్రులకు సమాచారం ఇవ్వకుండా, ఏం,జి,ఏం లో కొనసాగుతున్న చికిత్స
తొలి సమయం, మహబూబాబాద్/ కొత్తగూడ, నవంబర్ 5:
ముత్యాలమ్మ గూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ నిర్లక్ష్యం కారణంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, వెంటనే హెడ్మాస్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా తుడుం దెబ్బ అధ్యక్షులు. మరియు కొత్తగూడెం గంగారం మండలాల అధ్యక్షులు పూణేం సందీప్ వెనక వెంకన్న ఇరుప రవి డిమాండ్ చేశారు
వారు తెలిపిన వివరాలప్రకారం…
మహబూబాబాద్ జిల్లా ముత్యాలమ్మ గూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుకుంటున్న విద్యార్థిని గత నెల31వ తారీకున ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని, సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేయాలి, కాని అలా చేయకుండా, గుట్టుచప్పుడు కాకుండా, అమ్మాయిని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించి,దారుణంగా చికిత్స చేయిస్తున్నారని ఆరోపించారు, ప్రస్తుతం అమ్మాయి చావు బ్రతుకులమధ్య చికిత్స అందిస్తున్నారని అన్నారు. ప్రధాన ఉపాధ్యాయురాలు పర్యవేక్షణ నిర్లక్ష్యం వల్లనే అమ్మాయి ఆత్మ పాల్పడిందని వెంటనే ఐటీడీఏ పీవో స్పందించి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ డిమాండ్ చేస్తుంది అన్నారు