కాకి క్రూరత్వం పై సస్పెన్షన్ వేటు

కాకి క్రూరత్వం పై సస్పెన్షన్ వేటు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఓ మంత్రి అనుచరుడి మెప్పు కోసం ఠాణాలో థర్డ్ డిగ్రీ ప్రయోగం,దృశ్యాలను వీడియో ద్వారా చూపించి మార్కులు కొట్టేయడం

“తొలి సమయం డెస్క్ హైదరాబాద్ మే 21:

వరంగల్ కమిషనరేట్ లో గత కొద్ది కాలంగా వివాదస్పద సీఐగా పేరు మూటగట్టు కున్న మిల్స్ కాలనీ సీఐ వెంకట్ రత్నం అడ్డంగా సస్పెండ్ అయిన సంఘటన విధితమే. అయితే విది వంచితులు, తెలిసితెలియక తప్పులు చేసి ఠాణాకు వచ్చిన బాధితులకు, కౌన్సిలింగ్ చేసి వారికి కనువిప్పు కలిగించి గాడిలో పెట్టాల్సిన బాధ్యతాయుత పోలీస్ వృత్తి లో ఉన్న సీఐ అందుకు విరుద్దంగా ప్రవర్తించాడని, అతని గురించి విస్తూపోయే అంశాలు ఒక్కటి వెలుగు చూస్తున్నాయి. తొమ్మిది సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తిపై భువివాదం కేసు నమోదు చేసి సస్పెన్షన్ కు గురైనట్లు చెబుతున్న ఆ సీఐకి క్యారెక్టర్,నైతికత లేని ఇంకొన్ని పర్శ్వాలు కూడా వెలుగు చూస్తున్నాయి”

ఓ మంత్రి అనుచరుడి మెప్పు పొందడం కోసం పోలీస్ స్టేషన్ లో తన హద్దులు దాటి ప్రవర్తిస్తాడు అనే ప్రచారం ఉన్నది. అనుచరుడు చెప్పిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా చూపేడుతూ క్రూరత్వానికి పాల్పడేవారని టాక్ నడుస్తోంది.

వరంగల్లో హత్యకు గురైన ఓ వైద్యుడి భార్యతో చిల్లరగా అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీస్ శాఖలో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
సదరు వైద్యుడి హత్య కేసులో అతని బార్యే ప్రాధాన నిండుతురాలిగా పోలీసులు గుర్తించారు, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందని ఆమెను జైలుకు పంపారు, జైలులో ఖైదీగా ఉన్న ఆమెను విచారణ పేరుతో 3రోజులు కస్టడీలోకి తీసుకున్న సీఐ పీఎస్ ఆవరణంలో లోనే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి కస్టడీ అనంతరం ఆమెను జైలుకు పంపించే సమయంలో ఈ విషయాలు బయటకు పొక్కడంతో వరంగల్ కమిషనర్ సన్ ప్రీతి సింగ్ విచారణ చేపట్టారని, విచారణ లో వెంకట్ రత్నం నీచ నిర్వాకం నిజమైనట్లు తెలుస్తోంది, మొత్తం గా
రక్షకుడుగా ఉండాల్సిన కాకిలో నైతికత, క్యారెక్టర్ లేక పోవడమే కాదు క్రూరత్వం కూడా తోడైంది అని అడ్డంగా సస్పెండ్ అయ్యాడు అనే ఆరోపణలు వినపడుతున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *