ఆదివాసీ దార్మిక పరిషత్ ఏర్పాటుకు “నేను సైతం అన్న మంత్రి సీతక్క”
—త్వరలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సిఏం భట్టి విక్రమార్క లతో సమాలోచన చేస్తాను అని హామీ ఇచ్చిన మంత్రి సీతక్క
కోయ పుణ్యం ధర్మ ప్రచారక్, ఆదివాసి 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ
తొలి సమయం డెస్క్ హైదరాబాద్ మార్చి 2:
ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను, ఆస్తిత్వాన్ని కాపాడేందుకు నేను సహితం నా జాతి కోసం సహకారం చేస్తాను అని , త్వరలో సిఎం రేవంత్ రెడ్డి, మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకొనిపోతానని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివాసీ 9తెగల సమన్వయ కర్త చుంచు రామకృష్ణ మంత్రి సీతక్కను హైదరాబాద్ లోని ఆమె స్వగృహంలో కలిసి ఆదివాసీ ధార్మిక పరిషత్ అవసరాన్ని తెలియజేశారు, ఆదివాసీల మనుగడ పై అనేక విషయాలు మంత్రి సీతక్క తో ఏకరువు పెట్టారు. 5వ షెడ్యూల్లో అన్య సంస్కృతులు వ్యాపకాలు ప్రచారాలు, ప్రాచ్యత్త సంస్కృతుల వ్యాపకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అని, దాంతో ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే ఆదివాసీ ఇలవేల్పుల ప్రకృతి గుళ్ళు ,గుహలు, క్షేత్రాలు కనుమరుగు అవుతున్నాయి అన్నారు. దీనితో పాటుగా ఆదివాసీ యువతరం లెఫ్ట్ భావజాలానికి ఆకర్షితులు అవుతున్నారని, చెడు వ్యాపకాల వైపు ప్రభావితం అవుతున్నారని అన్నారు. అడవుల్లో అమాయక ఆదివాసీల బ్రతుకులు రోజు రోజుకు ప్రశ్నార్థకమై పోతున్నాయి అన్నారు. మసీదుల్లో, చర్చిల్లో , గుళ్ళల్లోని పూజారులకు , ఫాస్టర్లకి, ఇమామ్ లకు ఎండోమెంట్ శాఖ, వక్ఫ్ బోర్డు వారు కనీస జీతభత్యం కింద 10వేల వరకు ఇస్తుందని అన్నారు. అదేవిధంగా ఆదివాసీ 9 తెగల వారు వివిధ ఇలవేల్పులను పూజిస్తారని అన్నారు. పూజారులు, వడ్డెలు , కటోడాలు అడ్తి డోలు కళాకారులు, సాహిత్య కళాకారులకు, తలపతులకు , పటేల్ వ్యవస్థకు గత ప్రభుత్వల నుండి తగిన సహకారం లేకపోవడం వలన ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన దేవీ దేవతల గుళ్లను కాపాడటం, జాతరల నిర్వహణకు కష్టం అవుతోంది అని అన్నారు. ఈ దేశ మొలవాసులైన ఆదివాసీల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోసం గత నెలలో రాష్ట్ర గవర్నర్ ను కూడా కలిసాం అన్నారు. గత 5 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులను కూడా కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది అన్నారు. ఆసియా ఖండంలోనే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరో కుంభమేలాగా ప్రతి రెండేళ్లకోసారి కొనసాగుతున్నదని అన్నారు కనుక వడ్డెలు, పూజారులు, కటొడాలు ,పేరంటాలు,తలపతులకు ,కనీసం ప్రతి నెలా 2000/- రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని, ఆడ్తి కళాకారులకు, సాహిత్య కళాకారులకు ప్రతి నెలా 5000/- రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని,అనేక ఆదివాసీ ఇంటి ఇలవేల్పుల జాతరలు కూడా దాదాపు 200 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అన్నారు. ఒక్కో జాతర కు కనీసం ఒక లక్ష రూపాయల నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని, 5వ షెడ్యూల్ లో ఆదివాసీ తెగల సంస్కృతి సంప్రదాయాల పునరుద్ధరణకు “ఆదివాసీ ధార్మిక పరిషత్ ” అనివార్యం అన్నారు. మొదట తెలంగాణ రాష్ట్రంలో అదివాసి ధార్మిక పరిషత్ తొలి అడుగు పడితే జాతీయ స్థాయి లో మిగిలిన రాష్ట్రాలకు రోల్ మోడల్ అవుతుంది అని, ఫలితంగా జాతీయ ఆదివాసీ ధార్మిక పరిషత్ ఏర్పాటుకు దారి సుగమం అవుతుంది అన్నారు. దీనిపై వెంటనే స్పందించిన సీతక్క మాట్లాడుతూ.. గత కొద్దికాలం నుండి కోయ పుణ్యం ధర్మ ప్రచారక్ ఆదివాసీల ఐక్యత కు, అభివృద్ధికి కేవలం ఆదివాసీ ధార్మిక పునరుద్దరణతోనే సాధ్యం అని నమ్మి ఆదిలాబాద్ నుండి భద్రాద్రి కొత్త గూడెం, చత్తీస్గడ్, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్, జార్కండ్ , మధ్యప్రదేశ్ లలోని ఆదివాసీ తెగలను ధార్మిక కార్యక్రమాల ద్వారా ఒక్కటి చేస్తున్నామని అన్నారు ఆదివాసీ ఇలవేల్పులు, గుళ్ళను జాతరల పునర్వ్యవస్థీకరణ లో భాగంగా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని గుర్తుచేశారు. ముఖ్యంగా 2023 ఫిబ్రవరి నెలలో 124 ఇలవేల్పుల సమ్మేళనం, ఆదివాసి భిన్న తెగలను ఐక్యం చేసిన చిరుమళ్ల సమ్మక్క పుట్టు గద్దెల జాతర చారిత్రక నేపధ్యాన్ని సంతరించుకున్న తీరును, సమ్మక్క పగిడిద్దరాజు ల కళ్యాణం ప్రత్యక్షంగా గమనించానని మంత్రి సీతక్క అన్నారు. ఈ ఆధ్యాత్మిక విషయాన్ని వెంటనే ప్రభుత్వ అధిష్టానం దృష్టికి తీసుకొని త్వరలో ఆదివాసీల మనుగడ, సంక్షేమానికి సంబంధించి తీపి కబురు తీసుకొస్తానని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదివాసీ మహిళా శక్తి నాయకురాలు ఈక సులోచన మాత పాల్గొన్నారు