- బాలకుమారుని జాతరకు రానున్న మంత్రి సీతక్క, మాజీ ఎంపీ సోయం బాపురావు
తొలి సమయం, మహబూబాబాద్ ఫిబ్రవరి21:
ఆదివాసి సామాజిక వర్గం చుంచు వారి ఇలవేల్పు బాలకుమారుని జాతర మడగూడెం లో 22,23,24 తేదీలలో ఘనంగా జరుగనున్నది. బాలకుమారుడి జాతర కమిటీ ఆదివాసీ ప్రజా ప్రతినిధులు మరియు ముఖ్య నేతలకు ఆహ్వానం పలికారు. ఫిబ్రవరి 23 న ఆదివారం రోజు బాలకుమారుడు గద్దెల మీద ఆశీనులు కానున్న సందర్బంగా సమ్మక్క తల్లి వారసురాలు, ఆదివాసీ ఆడబిడ్డ పంచాయితి రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి, శ్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క మరియు ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు ముఖ్య అతిథులుగా రానున్నారని బాలకుమారుడి జాతర కమిటీ మరియు ఆదివాసీ 9తెగల సమన్వయకర్త కోయ పుణ్యం ధర్మ ప్రచారక్ చుంచు రామకృష్ణ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. తలపతి చుంచు శ్రీనివాస్, సారయ్య,సారంగధర్, సుధాకర్ చుంచు లక్ష్మి నారాయణ, పడిగవడ్డెలు,యాప వంశస్తులు చుంచు పాపయ్య, లక్ష్మయ్య,కృష్ణ నగర్ సర్పంచ్ వెంకటలక్ష్మి,,దేవర బాలలు వంశ స్తులు జాతర విజయవంతం చేయడం కోసం అలుపెరుగకుండా పని చేస్తున్నారు. 21 వతారీకు శనివారం తెల్లవారు జాము నుండి జాతర ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.. ఆదివాసీలు అశేషంగా హాజరై బాలకుమారుని జాతరను జయ ప్రధం చేయాలని చుంచు వారి పరివారం కోరుతున్నారు