బుర్దారం శ్రీ జ్వాలా లక్ష్మీ నృసింహస్వామి గుడిని సందర్శించిన మహా చండీ ఉపాసకులు డాక్టర్ హరి క్రిష్ణ
— గుడికి సంబందించి పలు సూచనలు చేసిన మహా చండీ ఉపాసకులు
తొలి సమయం డెస్క్ ఫిబ్రవరి14:
భద్రాద్రి కొత్తగూడెం కరకగూడెం మండల పరిధిలోని బుద్ధారం శ్రీ లక్ష్మీనృసింహస్వామి గుడిని మహాచండి ఉపాసకులు డాక్టర్ హరికృష్ణ జి సందర్శించి గుడి శాస్త్రీయతపై పలు సూచనలు ఇచ్చారు. గుడికి వెళ్లే దారిలో కాళికామాతకు, దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు తర్వాత శ్రీ జ్వాల లక్ష్మి నృసింహస్వామి గర్భ గుడికి వెళ్లే దారిలో బాల గణపతి విగ్రహాన్ని పున ప్రతిష్ట చేయాలని సూచన చేశారు. గుడి ధ్వజస్తంభం శాస్త్రీయయతకు సంబంధించి సమాలోచన చేశారు, ధ్వజస్తంభమును పునర్ ప్రతిష్టాపన ప్రదేశాన్ని శాస్త్రియత అదారాలతో మార్కింగ్ చేశారు ఈ కార్యక్రమంలో గుడి పూజారి పూల బోయిన రవితేజ పూల బోయిన శంకరయ్య. కోయ పుణ్యం ధర్మ ప్రచారక్ ఆదివాసీ 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ. చుంచు ఆదిలక్ష్మి, ఆదార్ సొసైటీ మెట్ల పాపయ్య. మెట్ల నీరజ,బండ వెంకటేశ్వరరావు చుంచు సంతోష్ సమ్మక్క దీక్ష బాలుడు. తదితరులు పాల్గొన్నారు
–