ఘనంగా సమ్మక్క పగిడిద్ద రాజు కళ్యాణ ఎదుర్కోలు
–చందా వంశం మహిళలు ఎ దిరె వారికి హారతులతో ఆహ్వానం
— ఆదివాసీ సమాజాన్ని కుటుంబాలను ఒక్క దెగ్గరకు చేర్చిన పండుగగా ఎదుర్కోలు నిలిచింది
తొలి సమయం, మహబూబాబాద్ ఫిబ్రవరి12:
భద్రాద్రికొత్త గూడెం చిరుమళ్ళ లో సమ్మక్క పగిడిద్ద రాజు ఎదుర్కోలు అత్యంత సంబురంగా జరిగింది ఎదిర నుండి పగిడిద్ద రాజుతో పాటుగా ధర్మరాజు పిడుగు రాజు సడాలమ్మ, ముత్యాలమ్మ వేల్పులు రాగా, చెగర్షల నుండి లక్ష్మిదేవిలు ఇలా వేల్పులు వచ్చారు వీరు చిరుమళ్ల అడవి లోని పిండ్రాల గుట్ట వద్ద బస చేశారు. చిరుమళ్ళగ్రామం నుండి చందావంశ మహిళలు హారతులతో స్వాగతం పలికారు
సమ్మక్క మరియు సారక్క ఇతర వేల్పులతో చిరుమళ్ళగ్రామం సెంటర్ లో ఇరువైపుల కుటుంబాలు కలిశారు , ఇక్కడే ఎదుర్కోలు ప్రక్రియ సంబురాలు మొదలు అయ్యాయి. ఇరువర్గాలు కలిసిన సందర్బంగా ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలు డోలి దెబ్బలు, నృత్యాలతో సందర్బం మొత్తంగా ఎదుర్కోలు సంబురాలు ఆకాశాన్ని అంటాయి. మొత్తం ఆదివాసీ సబ్బండ శ్రేణుల ఐక్య సంఘటనకు ఎదుర్కోలు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది