సమ్మక్క పానుపును గద్దెల పైకి తెచ్చిన చందా వంశీయులు
తొలి సమయం, చిరుమళ్ళ ఫిబ్రవరి11
చందా వంశీయులు సమ్మక్క కళ్యానోత్సవం నిమిత్తమై, సమ్మక్క పుట్టింటి వంశీయులు చందా వారు సమ్మక్క పానుపును అదివాసి సంప్రదాయ వాయిద్యాలు చప్పుళ్లతో రాత్రి 11 గంటలకు గద్దెలపై తెచ్చారు, డోలు దెబ్బలతో సప్పుళ్లు చేస్తూ సమ్మక్క తల్లిని తెచ్చిన విధానం ఆదివాసి ఐక్యత,కుటుంబాల పరస్పర సహకారానికి ప్రతీకగా నిలిచింది, ఈ ఘట్టం అత్యంత ఆసక్తిని ప్రత్యేకతను సంతరించుకున్నది. పానుపు తో పాటు సమ్మక్క తల్లి ఆభరణాలు వడ్డాణం, కడియాలు, లాంటివి కూడ గద్దెల పై ఉంచారు